Kalyan Ram : ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నందమూరి వారసులైన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో ఇంట్లో ఉన్న స్త్రీల గురించి ప్రస్తావించడం అవసరమా? అని ప్రశ్నించారు.
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ…. అసెంబ్లీ దేవాలయం లాంటిది. అక్కడ ఎంతో మంది చదువుకున్న వ్యక్తులు, మేధావులు ఉంటారు. అలాంటి చోట ఓ మహిళను ఇలా దూషించడం సరికాదని అన్నారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని కానీ ఇక్కడ అటువంటి కనిపించడం లేదని బాధ పడ్డారు.
పూజ్యులు నందమూరి తారకరామా రావు గారు స్త్రీలకు ఎంత గౌరవం ఇచ్చే వారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. అటువంటి చోట ఇలా జరగడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ ఇలా ఆడవాళ్లను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. అకారణంగా మహిళలను దూషించడం సరికాదని అన్నారు. ఇక మీదటైనా అందరూ హుందాగా నడుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇక మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ… మాట అనేది వ్యక్తిత్వానికి ప్రమాణం అని అటువంటి మాట మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు. ఇక రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణం అని కానీ రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి గురించి ఇలా అనడం సరికాదన్నారు.
ఆడవాళ్లను గౌరవించే సంప్రదాయం మన రక్తంలోనే ఇమిడి ఉందని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఇలా మాట్లాడడం లేదని ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక దేశ పౌరుడిగా, ఒక తెలుగు వ్యక్తిగా ఇలా మాట్లాడుతున్నానని తెలిపారు.
Read Also : Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world