Trivikram srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి వాటిని తొలగించి కార్లకు ఫైన్ వేయడం మనం చూస్తున్నాము. కోర్టు ఆదేశాల మేరకే కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని సూచించినప్పటికీ కొందరు అలాగే తిరగడంతో పోలీసులు అటువంటి వాహనాలకు బ్లాక్ ఫిలిం తొలగించడమే కాకుండా ఫైన్ కూడా వేస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు మనోజ్ వంటి హీరోలకు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.వీరి కార్లను పోలీసులు ఆపి కార్లకున్న బ్లాక్ ఫిలిం తొలగించడమే కాకుండా వీరితో ఫైన్ కూడా కట్టించుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు వారి ప్రైవసీ కోసం ఇలాంటి కార్లను ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి వాటి వల్ల లాభాల కన్నా నష్టాలే అధికంగా ఉన్నాయనీ కోర్టు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారును ఆపారు. తన కారుకు బ్లాక్ ఫిలిం ఉండడంతో పోలీసులు స్వయంగా బ్లాక్ ఫిలిం తొలగించి కారుకు ఫైన్ వేసారు. పోలీసులు కారుని ఆపినప్పుడు కారులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.