Intinti gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫిబ్రవరి 15 2022 హైలెట్స్ ఏంటో చూసేద్దాం. మనోజ్ మోసం చేశాడని తెలుసుకొని తీవ్రంగా బాధపడతాడు అభి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. దీనంగా కూర్చున్న అతడిని గమనించిన అంకిత.. ఏమైంది ఒంట్లో బాగోలేదా.. అని అడుగుతుంది. బాగానే ఉంది అంటాడు అభి. ఏం జరిగింది అభి అని ప్రశ్నిస్తుంది.
అభి.. భోం చేద్దువు గానీ పదా. నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటుంది అంకిత. నాకు ఆకలి లేదు అంటాడు అభి. ఇంతలో తన రూమ్ లోకి తులసి వస్తుంది. ఏం జరిగిందిరా అని అడుగుతుంది తులసి. నాకు ఎవరితో మాట్లాడలనిలేదు అని అరిచి మరీ చెబుతాడు అభి.
అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. ఈ అమ్మ ఉన్నది నీకు సహాయం చేయడానికే కానీ.. విసిగించడానికి కాదు అంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయ్ మామ్ అని నమస్కరించి విసుక్కుంటాడు.
దీంతో తులసి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే నందు వస్తాడు. అభి ఏదో టెన్షన్లో ఉన్నాడు నేను ఎంత అడిగినా చెప్పడం లేదు అని నందుకి తులసి చెప్తుంది దానితో నా తలనొప్పులు నాకున్నాయి ఈ సోది అంతా నాకెందుకు చెప్తున్నావ్ అంటాడు నందు.
ఇంతలో సేటు వచ్చి అభి బయటికి రా అంటాడు. దీంతో సేటు ఏంటి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేశాడు అని కంగారు పడతాడు అభి.. ఏమైంది చెప్పండి అని నందు సేటును అడుగుతాడు దానికి సేటు వాడు నాదగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నాడు అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో అభి వచ్చి.. సేటు మీరు ఇంటికి ఎందుకు వచ్చారు.. అంటాడు. నాకు తెలుసు అప్పు ఎలా వసూలు చేసుకోవాలో అంటాడు. నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోయిన సంగతి నాకు తెలుసు. ముందు నా డబ్బు నాకు కట్టు అంటాడు సేటు.
అసలు నువ్వు 10 లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నావు అంటూ తులసి ప్రశ్నిస్తుంది. చెంపదెబ్బ కొడుతుంది. ఇంతలో అంకిత వచ్చి ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు నన్ను కూడా అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నావు అంటుంది.
నా ఫ్రెండ్ ను ఎలాగైనా పట్టుకుంటా.. అంటాడు అభి. ఇక నేను అభితో ఉండను ఆంటి. రేపు డబ్బు కోసం నువ్వు నన్ను కూడా తాకట్టు పెట్టమని నమ్మకం ఏంటి అని ఏడుస్తుంది అంకిత. నా ప్రేమకు అర్థం లేదు. మా మమ్మి చెబుతున్నా వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానంటూ అంకిత అభిని వదిలేసి వెళ్లిపోబోతుంది.
ఇంతలో అంకిత.. అంటూ గట్టిగా అరిచి ఒక్కసారిగా నిద్రలో నుంచి లేస్తాడు. ఇదంతా కల అని అనుకునేలోపు అంకిత లేచి ఏం అయ్యింది నువ్ చెప్పడంలేదు చెప్పు అని అంటుంది.
మరోవైపు తులసి ఇంటికి పోలీసులు వస్తారు. ఏమైంది సర్.. ఇటు వచ్చారు అని నందు అడుగుతాడు. దీంతో అభి ఎక్కడ అని అడుగుతారు పోలీసులు. ఏమైంది.. అభి ఏం చేశాడు అని అడుగుతాడు. దీంతో డబ్బుల కోసం తన ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు అని చెప్తారు. ఆ తర్వాత ఏం కథ ఏమవుతుందో చూడాలంటే తరువాయి భాగం చూడాల్సిందే..
Tufan9 Telugu News And Updates Breaking News All over World