...

Intinti Gruhalakshmi: అప్పు విషయంలో నందు లాస్య వ్యూహాలేంటో చూద్దాం.!

Intinti Gruhalakshmi: ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కట్టుకున్న భర్తను, అత్తమామలను, పిల్లలను అందరినీ అన్నింటినీ తానే చూసుకుంటూ ఇంట్లోని విషయాలను ఇంటి పరువును తన భుజాలపై మోస్తూ అనుకువగా ఉండే ఒక సాధారణ ఇల్లాలిగా తులసి (కస్తూరి)నటనకు తెలుగు రాష్ట్రాలు ఫిదా అయ్యాయి. దానితో ఇంటింటా ఈ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల ఆదరనాభిమానాలు పొందుతుంది. అయితే శని, ఆది వారాలను ముగించుకుని తిరిగి సోమవారం ఈ సీరియల్‌ ప్రసారం అవుతుంది. మరి సోమవారం, 14 ఫిబ్రవరి 2022, 555 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూసేద్దాం.

gruhalakshmi latest episode highlights

శశికళ వచ్చి తీసుకున్న అప్పు ఎప్పుడు తీరుస్తారంటూ తులసిని అడుగుతుంది. మూడు నెలల్లో కాస్త సంవత్సరం అయింది.. ఇప్పటి వరకు అప్పు తీర్చలేదని.. తీసుకున్న 20 లక్షలకు వడ్డీతో సహా 80 లక్షలు అయిందని.. వెంటనే 80 లక్షలు కట్టాలని లేకపోతే ఇల్లును స్వాధీనం చేసుకుంటా అని తులసికి శశికళ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అప్పుడు ఎందుకు 20 లక్షలు తీసుకున్నానో అందరికీ తెలుసు. మామయ్య గారి ఆపరేషన్ కోసం తీసుకున్న డబ్బులు అవి. అందుకే అప్పుడు తెల్ల పేపర్ల సంతకం పెట్టాల్సి వచ్చింది అని తులసి చెబుతుంది. వారం రోజుల్లో డబ్బు కట్టాల్సిందే.. లేదంటే నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటా అని చెప్పి శశికల వెళ్లిపోతుంది.

ఆ డబ్బులను అందరూ కట్టాల్సిందేనని తన వంతుగా 20 లక్షలు కడతానని మిగితా వాళ్లు మీ డబ్బులు రెడీ చేసుకోండని తులసి చెప్తుంది. దానికి లాస్య.. బాగుంది తులసి.. డబ్బులు తీసుకునేప్పుడు మాత్రం నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం అప్పును అందరినీ షేర్ చేసుకోమంటావా అంటూ సీరియస్ అవుతుంది. మరోవైపు మనకెందుకు ఈ తలనొప్పి అని అంకితతో అంటాడు అభి. అలా అంటావు ఏంటి అభి. అప్పుడు తాతయ్యకు సీరియస్‌గా ఉంది కాబట్టి ఆ పని చేసింది కదా. నువ్వు పెద్ద కొడుకుగా నీ షేర్ డబ్బులు 20 లక్షలు కట్టాల్సిందే అభి అంటుంది అంకిత. దీంతో సరే.. నా తిప్పలు ఏవో నేను పడతాను కానీ.. నేను డబ్బు తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని మాత్రం నన్ను అడగొద్దు అని అంటాడు అభి.

మరోవైపు తులసి.. ఫ్యాక్టరీ మేనేజర్ కు ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతుంది. దీంతో నాలుగైదు లక్షలు ఉంటాయి మేడమ్ అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అనసూయ వచ్చి తప్పు చేశావు తులసి అని అంటుంది. ఇంతలో పరందామయ్య వచ్చి తులసిని ఏం అనకు అనసూయ అంటాడు పరందామయ్య.

ఈ ఇంటిని తులసికి రాసిచ్చినంత మాత్రాన.. ఈ ఇంటి భారం తులసి మోయాలని నేను అనుకోలేదు. అది కాదండి.. అప్పుడు తెల్ల కాగితం మీద సంతకం పెట్టడం ఏంటి అంటుంది. దీంతో తులసి అప్పుడు తెల్లకాగితం మీద సంతకం పెట్టకుండా ఉండి ఉంటే ఇప్పుడు నీ నుదిటిన బొట్టు ఉండేది కాదు అంటాడు పరందామయ్య.

మరోవైపు అభి.. ఓ సేటు దగ్గరికి వెళ్లి తన ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టి 10 లక్షలు అప్పు తీసుకుంటాడు. మరోవైపు తన షేర్ డబ్బులు ఎలా తీర్చాలా అని నందు టెన్షన్ పడుతుంటాడు. తులసి చేసిన అప్పును మనం ఎందుకు తీర్చాలి అంటుంది లాస్య నందుతో అంటుంది.

ఆ అప్పు చేసింది మా నాన్న గారి కోసమే కదా అంటాడు నందు. అప్పుడు తీసుకున్నది 20 లక్షలే కదా. అందులోనే షేర్ చేయమను అంటుంది లాస్య. ఏమో లాస్య నాకేం అర్థం కావడం లేదు అంటాడు నందు.
మరోవైపు తను అప్పుగా తీసుకున్న 10 లక్షల రూపాయలను తీసుకెళ్లి తన ఫ్రెండ్ ప్రకాశ్ చేతుల్లో పెడతాడు అభి. వీటిని స్టాక్స్ లో పెట్టు అంటాడు. అతడు అభిని మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని అభి గ్రహించలేకపోతాడు.

ఇన్నిరోజులు లాస్య మాటలు వినిపించుకోకుండా.. పట్టించుకోకుండా తప్పు చేశాను అని అంటాడు నందు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాను అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయిభాగంలో చూడాల్సిందే.