Intinti gruhalakshmi: మధ్యతరగతి కుంటుంబ కష్టసుఖాలు తెలియాలి అంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ చూడాల్సిందే మరి 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 557 హైలైట్స్ ఏంటో చూసేద్దామా.. నీ మాటలు వింటుంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది అని అంకితతో అభి అంటాడు. మంచైనా చెడైనా.. కష్టమైనా.. సుఖమైనా నా తలనొప్పి నన్నే పడనీయండి. ఎవరి జాలి.. ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు. మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి.
మరోవైపు అభి ఏదో ప్రాబ్లమ్లో ఇరుక్కున్నాడు. ఎలా తెలుసుకోవాలని తులసి ఆలోచిస్తుంటుంది. ఇంతలో దివ్య వచ్చి ఏడుస్తుంది. ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది తులసి. దీంతో మామ్.. రేపో మాపో మనం రోడ్డు మీద పడబోతున్నామట కదా. ఈ ఇల్లు లాగేసుకుంటారట కదా అని ఏడుస్తూ చెబుతుంది దివ్య. ఎవరు చెప్పారమ్మా అని అడుగుతుంది తులసి. లాస్య ఆంటి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను అంటుంది దివ్య.
మరోవైపు అభి ఆలోచించుకుంటూ బైక్ మీద వెళ్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఇంతలో ఓ జ్యూస్ షాపు వద్ద మనోజ్ కనిపిస్తాడు అభికి. దీంతో వెంటనే మనోజ్ అంటూ తన దగ్గరికి వెళ్లబోతాడు. మనోజ్ దొరకకుండా పరిగెడతాడు. చివరకు మనోజ్‌ను దొరికించుకొని అతడిపై దాడి చేస్తాడు. వదులురా అంటాడు మనోజ్. ఏంట్రా వదిలేది. నువ్వు మోసం చేసినప్పుడు నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా ఛీ.. అంటూ ముందుకు నెట్టేస్తాడు అభి.
దీంతో అక్కడే ఉన్న పగిలిన బీరు సీసా మనోజ్‌కు గుచ్చుకొని ప్రాణం పోతుంది. దీంతో ఏం చేయాలో అభికి అర్థం కాక వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అతడు పారిపోవడం అక్కడ ఉన్న ఓ మహిళ చూస్తుంది. మరోవైపు అంకిత అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో తులసి వచ్చి ఏమైంది అమ్మా అని అడుగుతుంది అంకితను. ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది ఆంటి అంటుంది అంకిత. అభి ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. పొద్దున వెళ్లాడు.. ఇప్పటి వరకు రాలేదు అంటుంది అంకిత. నిన్నటి నుంచి మనిషి మనిషిగా లేడు. నేను అడిగినా కూడా ఏం చెప్పడం లేదు అంటుంది తులసి.
మరోవైపు అభి భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంటాడు. ఓ టీ కొట్టు దగ్గర ఆగుతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లు ఫ్రెండ్ నే మర్డర్ చేసి పారిపోయాడట అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో ఇంకా అభి భయపడిపోతాడు.
మరోవైపు అభి ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతుంటారు అంకిత, తులసి. అభి ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఎవ్వరూ తమ దగ్గరికి రాలేదని చెప్పారు అని అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఇక్కడ అభి అంటే ఎవరు అని అడుగుతారు. ఇక్కడే ఉంటాడా అని అడుగుతారు. అభి నా పెద్ద కొడుకు.. ఎందుకు అని అడుగుతుంది తులసి. దీంతో డబ్బుల కోసం గొడవ పడి తన ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు అని చెబుతారు పోలీసులు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tufan9 Telugu News And Updates Breaking News All over World