...

Devatha: రాధను బెదిరించిన ఆదిత్య… దేవీని తన దగ్గరకు తీసుకెళ్లనున్నాడా..?

Devatha: మా టీవీలో ప్రసారమవుతున్న ఒక ప్రముఖ సీరియల్​ దేవత. దేవీ ఆదిత్య రాధల మధ్య ఉన్న ప్రేమానురాగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి 16 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్​ హైలెట్స్​ ఏంటో చూసేద్దాం పదండి. ఆదిత్య స్కూల్ దగ్గర పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.. ఏమ్మా చిన్మయి దేవి ఎందుకు అలా వెళ్ళిపోయిందని అడుగుతారు. సారీ అంకుల్ దేవి ఇంకెప్పుడూ మీతో మాట్లాడకుండా వినాయకుడి మీద ఒట్టు వేసి అమ్మకు మాట ఇచ్చింది దేవి. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కోపంగా రాధ దగ్గరకు వెళతాడు.

Advertisement

devatha latest episodes highlights

Advertisement

దేవి చిన్న పిల్ల తనను ఎందుకు అలా చేస్తున్నావు.. దేవి నీ బిడ్డే కాదు నా బిడ్డ కూడా.. నీ ప్రేమకు నన్ను దూరం చేసింది చాలదన్నట్టు నా బిడ్డకు కూడా నన్ను దూరం చేస్తావా అంటాడు ఆదిత్య. తెలియక ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉండండి బిడ్డ దగ్గరకు రాకండి అని ఆదిత్యను వారిస్తుంది రాధ.. నా బిడ్డను నా నుంచి దూరం చేసే హక్కు తల్లిగా నీకు కూడా లేదు అంటాడు ఆదిత్య. దేవి నీ బిడ్డని నేను చెప్పాలి.. కాదు అంటే ఏం చేస్తావ్ పెనిమిటి అని ఆదిత్య ప్రశ్నిస్తుంది రాధ. నన్ను నా బిడ్డను వదిలేయండి అని చెబుతుంది.

Advertisement

నీ చెల్లెలు కోసం నన్ను వదిలేసి వెళ్లిపోయారు నేను భరించాను ఇక భరించడం నావల్లకాదు.. నా బిడ్డను నా నుంచి దూరం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను.. నా బిడ్డ నాకు కావాలి అంటాడు ఆదిత్య. కుదరదు అంటే మాత్రం దేవి నా కూతురు అన్న నిజం ప్రపంచానికి చెప్పి నా బిడ్డను నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు. నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నా బిడ్డ కోసం నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు ఉండదు కదా అని ఆదిత్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు. దానితో రాధ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది తరువాతి ఎపిసోడ్​లో చూద్దాం.

Advertisement
Advertisement