Devatha Feb 15 Today Episode : మా టీవీలో ప్రసారమవుతూ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ దేవత. ఇంత అందులోని రాధ ఆదిత్య దేవి క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఫిబ్రవరి 15 2022 హైలెట్స్ ఏంటో చూసేద్దామా.. ఆదిత్య సత్యతో దేవి తన ప్రాణం తను లేకుండా నేను ఉండలేను అని చెప్పిన విషయాన్ని దేవుడమ్మ వింటుంది. దానితో రాధను కలవడానికి వాళ్ల ఇంటికి దేవుడమ్మ వెళ్తుంది..! రాధ వాళ్ళ అత్తయ్య దేవుడమ్మతో మాట్లాడిందా.!?
దేవుడమ్మ రాధ వాళ్ల ఇంటికి వస్తుంది. వాళ్ళ అత్తయ్య వస్తుందన్న సంగతి తెలుసుకున్న రాధ.. ఇంట్లో తన ఫోటోలు అన్నీ తీసుకుని రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఇక రాధ ఉన్న గది దగ్గరికి వచ్చి దేవుడమ్మ ఆ గదిలోనుంచి బయటకు రమ్మని పిలుస్తుంది. ఇంట్లో పెద్దవాళ్లు ఎవ్వరూ లేరు పొరుగూరు పెళ్లికి వెళ్లారు వాళ్లు వచ్చాక రమ్మని పిలుస్తుంది. నేను నీతోనే మాట్లాడాలి రాధ అంటుంది దేవుడమ్మ.
Devatha Feb 15 Today Episode : రుక్మిణినే కొడలని తెలిసిపోనుందా?
ఇక రాధా ఆ గదిలోనుంచి బయటకు రాకుండా తలుపు తీసి డోర్ వెనకాల నుంచుని దేవుడమ్మ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. దేవి అంటే ఆదిత్యకు ఇష్టం ఆదిత్యకు దేవి అంటే వాళ్లిద్దరూ చేసిన తప్పేంటని ప్రశ్నిస్తుంది. తనతోపాటు ఆదిత్య దగ్గరకి దేవిని పంపించమని అడుగుతుంది. దేవి మీతోపాటు వస్తానంటే నిరభ్యంతరంగా తీసుకెళ్ళమని రాధ చెబుతుంది. దేవి అని దేవుడమ్మ ఎంత పిలిచినా పిల్లలు బయటకు రారు.
రాధ పిలవగానే బయటకు వచ్చిన దేవి… ఆఫీసర్ దగ్గరికి నేను రాను ఆఫీసర్ సారుతో మాట్లాడనని మా అమ్మతో ఒట్టు పెట్టాను. మీతో నేను రాను అని దేవి చెబుతుంది. చిన్న పిల్లవైనా నువ్వు చాలా మంచి దానివి. మీ అమ్మ మాట వింటున్నావు ఆదిత్య నా మాట వినడం లేదు అని అంటుంది. నువ్ నీ పల్లల్ని చాలా చక్కగా నీ మాట వినేలా పెంచుతున్నావ్ అంటూ వెనుతిరిగి వెళ్లిపోతుంది.
వాళ్ళమ్మ వెళ్లి పిల్లల్ని కలిసింది అని తెలిసి ఆదిత్య ఏం చేయనున్నాడు.. స్కూల్ దగ్గరకి వెళ్లిన ఆదిత్యకు దేవి వాళ్ల అమ్మమీద ఒట్టు పెట్టిన విషయం తెలిసి ఏం చేస్తాడు..!?… రాధతో ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతారో తరువాత ఎపిసోడ్లో చూద్దాం.
Read Also : Intinti gruhalakshmi: ఇంటికొచ్చి గొడవ చేసిన సేటు… పోలీసులు అభిని అరెస్ట్ చేస్తారా?
Tufan9 Telugu News And Updates Breaking News All over World