Devatha Aug 3 Today Episode : చిన్మయికి ధైర్యం చెప్పిన రాధ.. రుక్మిణికి అండగా నిలిచిన భాగ్యమ్మ..?

Updated on: August 3, 2022

Devatha Aug 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ,దేవి అన్న మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధా ఎలా అయినా మాధవ నుంచి దేవిని కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.ఈ పరిస్థితులలో నేను ఒకటే కాకుండా నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు భాగ్యమ్మ తనకు తోడుగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది రాద. ఆ తర్వాత కమల,భాష ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్లి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు.

భాగ్యమ్మ కూడా తన బట్టలోని సర్దుకుని ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోనే భాష కమలనీ చూసిన భాగ్యమ్మ చెట్ల చాటున దాక్కుకుంటుంది. ఆ తర్వాత వారికీ కనపడకుండా ముసుగు వేసుకొని అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోతుంది. వైపు దేవి కరాటే సాధన చేస్తూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే అక్కడికి చిన్మయి వచ్చి నువ్వు వెళ్లి రెండు దినాలే అయింది అప్పుడే నీకు బలం వస్తుందా అయితే మన ఇద్దరం తలపడదామా ఇద్దరిలో ఎక్కువ బలం ఉందో తెలుస్తుంది అని అంటుంది చిన్మయి. ఇందులోనే రామ్మూర్తి దంపతులు అక్కడికి వచ్చి వారిద్దరిని చూసి సంతోష పడుతూ ఉండగా అప్పుడు చిన్మయి తన తల్లిని తలుచుకోగా ఇవి కూడా ఆదిత్య మాధవలను తలుచుకుంటుంది.

ఆ పోటీలో చిన్మయిని దేవి ఓడిస్తుంది. అప్పుడు చిన్మయి బాధపడుతూ ఉండగా రాధ ధైర్యం చెబుతుంది. మరొకవైపు ఆదిత్య బయటకు వెళ్లడానికి పెద్ద పడుతూ ఉండగా ఇంతలో సత్య అక్కడికి వచ్చి ఇది ఆఫీసు సమయం కాదు కదా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ఆఫీస్ పని కాదు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెబుతాడు ఆదిత్య. ఇందులోనే ఆదిత్య కు ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆ ఫోన్ సత్య తీసుకొని సర్ బయలుదేరారు వస్తున్నారు అని చెబుతుంది.

అప్పుడు అదేంటి అలా చెప్పావు అని ఆదిత్య అడగదా నీ పర్సనల్ విషయాల కోసం ఆఫీస్ ని వదులుకోవద్దు అని చెప్పి ఆదిత్య ఆఫీస్ కి పంపిస్తుంది సత్య. మనకు వైపు రామ్మూర్తి దంపతులు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడు భాగ్యమ్మ రామ్మూర్తి దంపతులతో మొన్న ఈ పొలంలో పనిచేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు రాధమ్మ ఇంట్లో పని ఇస్తాను రమ్మని చెప్పింది అని అంటుంది భాగ్యమ్మ.

Advertisement

అందుకు రామ్మూర్తి దంపతులకు కూడా సరే అనే భాగ్యమ్మని లోపలికి వెళ్ళమని చెబుతారు. ఆ తర్వాత భాగ్యమ్మ, రాధ దగ్గరికి వెళ్లి వీళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ మాటల్లో వింటే నీ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత అర్థమవుతుంది అని అంటుంది భాగ్యమ్మ. అలాగే మాధవ సారు నిన్ను ఏదో అంటున్నాడు అంటున్నావు కదా ఇప్పుడు ఏమంటాడో నేను కూడా చూస్తాను అంటూ రాధకు ధైర్యం చెబుతుంది భాగ్యమ్మ.

Read Also : Devatha July 27 Today Episode : సంతోషంలో దేవుడమ్మ కుటుంబం.. దేవి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న రాధ..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel