Devatha July 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సత్య బాధపడుతూ ఉండగా దేవుడమ్మ దంపతులు, భాషా దంపతులు వచ్చి ఓదారుస్తారు. అప్పుడు దేవుడమ్మ ఎలాగో నువ్వు అమెరికాకు వెళ్లకుండా ఉంటున్నావ్ కాబట్టి రేపు నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలి అని అంటుంది. అప్పుడు సత్య బాధతో ఇంతవరకు ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ఏం మంచి జరిగింది అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ అలా మాట్లాడకూడదు అని సత్యకీ నచ్చ చెబుతుంది.
అప్పుడు భాష నేను ఏం తేవాలో చెప్పండి అంటూ హడావిడి చేస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి ఆదిత్య రావడంతో ఆదిత్య కు రేపు ఇంట్లో పూజ చేస్తున్నాము నీకోసం కొత్త బట్టలు తెప్పించాను అని చెబుతుంది దేవుడమ్మ. మరొకవైపు జానకి ఇంట్లో పని చేస్తూ ఉండగా ఇంతలో రాధ అక్కడికి వచ్చి ఇవన్నీ నేను చేస్తాను కదా అని అనడంతో వెంటనే రామ్మూర్తి అక్కడికి వచ్చి చేయనివ్వమ్మ ఏం పర్లేదు అలా పని చేస్తూ ఉండాలిలే అని అంటాడు.
అప్పుడు రామ్మూర్తి ఎందుకు ఇవన్నీ సిద్ధం చేస్తున్నావ్ అని అడగగా రేపు వరలక్ష్మి పూజ చేస్తున్నాము అని అనడంతో వెంటనే రామ్మూర్తి పూజకు కావాల్సినవన్నీ తెప్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జానకి నీకోసం ఒక మంచి చీర తెచ్చాను అని చెప్పి రాధకు చీర ఇవ్వగా అప్పుడు రాధ కు అనుమానం వచ్చి ఆ చీర నువ్వు తెచ్చావా అని అడగడంతో అప్పుడు జానకి తడబడుతూ ఉండగా అప్పుడు అసలు విషయం తెలుసుకున్న రాధ నాకు చీర వద్దు అని ముఖం మీద చెప్పేస్తుంది.
ఇక మరొకవైపు దేవుడమ్మ ఆదిత్యకు కుంకుడుకాయతో స్నానం చేపిస్తాను అని ఆదిత్య చిన్న పిల్లాడిలా వద్దు అంటూ మారం చేస్తూ ఉండగా అదేమి కుదరదు అంటూ ఆదిత్య కుంకుడు కాదు స్నానం చేపిస్తుంది దేవుడమ్మ. అది చూసి కుటుంబ సభ్యులందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవి, చిన్మయిలు కొత్త డ్రెస్సులు వేసుకొని ఒక డ్రెస్ గురించి ఒకరు పొగుడుకుంటూ ఉంటారు.
దేవత సీరియల్ జూలై 27 ఎపిసోడ్ : తండ్రికి దేవి విధించాలనుకున్న శిక్ష..
అది చూసి రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఆనందపడుతూ ఉంటారు. అది చూసి రాధ లోలోపల బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి గుళ్లో ఏర్పాటులను చూశారా జనాల మధ్యలో కాకుండా ఒక పక్కన ఏర్పాటు చేయమని పూజారికి చెప్పారా అని అనగా వెంటనే రామ్మూర్తి నేనేమైనా ఆదిత్యనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి అనడంతో వెంటనే దేవి ఆదిత్య గురించి చెప్పడంతో ఆలోచనలో పడి నేను ఆఫీసర్ అయ్యాక గుడికి వస్తాను అని చెబుతుంది.
ఆ తర్వాత రాధ దేవి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ ఇంట్లో వరలక్ష్మీ పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరూ అమ్మవారికి మనసులో కోరికలు చెప్పుకొని పూజలో కూర్చుంటారు. మరొకవైపు గుడికి వెళ్లిన రామ్మూర్తి కుటుంబం పూజలు చేయిస్తూ ఉంటారు.
Read Also : Devatha july 26 today Episode : మాధవ చెంప చెల్లెమనిపించిన ఆదిత్య.. భారీ కుట్ర పన్నిన మాధవ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World