Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?

Intinti gruhalakshmi Feb 24 Today Episode : అభిని కాపాడుకోవడం కోసం తులసి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ రాత్రిపూట ఎస్ఐ ఉండే బార్‌కి వెళ్లి తన కొడుకుని తనకు చూపించమని వేడుకుంటుంది. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అలసిపోకుండా చేస్తుంది. అయినా తన కుటుంబం మాత్రం తననే దోషిని చేసి నిందిస్తుంటారు. తులసికి ఎటువంటి సపోర్ట్‌ ఇవ్వకపోగా తనదే తప్పని వారిస్తుంటారు. ఆ రాత్రంతా తులసి అభి కోసం ఏడుస్తూనే ... Read more

By Ramesh Babu

Published on: February 24, 2022 1:00 PM

Updated on: February 24, 2022 1:29 PM

Intinti gruhalakshmi serial latest episode

---Advertisement---

Intinti gruhalakshmi Feb 24 Today Episode : అభిని కాపాడుకోవడం కోసం తులసి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ రాత్రిపూట ఎస్ఐ ఉండే బార్‌కి వెళ్లి తన కొడుకుని తనకు చూపించమని వేడుకుంటుంది. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అలసిపోకుండా చేస్తుంది. అయినా తన కుటుంబం మాత్రం తననే దోషిని చేసి నిందిస్తుంటారు. తులసికి ఎటువంటి సపోర్ట్‌ ఇవ్వకపోగా తనదే తప్పని వారిస్తుంటారు.

Intinti gruhalakshmi serial latest episode
Intinti gruhalakshmi Feb 24 Today Episode

ఆ రాత్రంతా తులసి అభి కోసం ఏడుస్తూనే ఉంటుంది. ఎలాగైనా రేపు ఆ ఎస్సై నిన్ను నా ముందు నిలబెట్టేలా చేస్తాను అభి అంటూ కుమిలిపోతుంది. మరునాడు ఉదయాన్నే.. అనసూయతో.. అత్తయ్యా.. నేను బయటికి వెళ్తున్నాను.. మీరు నాకోసం ఎదురు చూడకండి ఎప్పుడొస్తానో నాకే తెలియదు అంటుంది తులసి. సరే అమ్మా అంటుంది అనసూయ. ఎక్కడికి? ఆ పోలీస్ స్టేషన్‌కేనా అంటాడు నందు కోపంగా.. మీకు ముందే చెప్పాను నన్ను అడిగే హక్కులేదు అంటుంది.

దాంతో అంకిత తులసితో.. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం ఆంటీ.. ప్లీజ్ మీరు తొందరపడొద్దు అంటూ ఏడుస్తూ చెబుతుంది. నందు తండ్రి కూడా.. సరేరా నందు.. అభిని కాపాడే బాధ్యత నీది.. నీ ప్రయత్నం నువ్వు చెయ్యరా.. అంటూనే.. నందుకే సపోర్ట్ చేస్తాడు. ‘నిజంగానే నందు మీద మీ అందరికీ అంత నమ్మకం ఉందా? నాకు మాత్రం లేదు.. ఆయనకి మాట ఇవ్వడమే కానీ నిలబెట్టుకోవడం చేతకాదు.. అంటూ తులసి అంటుంది. ఇంక ఇంట్లో వాళ్లతో నా కొడుకుని బయటకు తీసుకురావడానికి నేను ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను.. ఇది నా మొండితనం అనుకుంటారో.. బాధ్యత అనుకుంటారో మీరు నన్ను ఏం అనుకుంటారో మీ ఇష్టం.. అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

సీన్ కట్ చేస్తే.. ఎస్‌ఐ వచ్చే టైమ్‌కి తులసి పోలిస్టేషన్ ఎదురుగా అభి ఫొటోస్ పెట్టి ధర్నాకు దిగుతుంది. నీకు ధైర్యం చాలా ఎక్కువ అనుకుంటా అంటాడు ఎస్‌ఐ. అలా ఇద్దరి మధ్య చాలా సేపు మాటలయుద్ధం నడుస్తుంది. దీనితో ఈ ఎపిసోడ్‌ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్‌లో ఎస్సై తులసి ధర్నాను ఎలా అడ్డుకుంటాడు. అభిని ఏం చేయనున్నాడో చూడాల్సిందే.

Read Also : Intinti gruhalakshmi: ఎస్సై కోసం బార్‌కి వెళ్లిన తులసి… కొడుకుని రక్షించుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఏం చేయనుంది

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే