Garuda Puranam : ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే దూరం చేసుకోండి. లేదంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.. కుటుంబ సమస్యలకు ఇదే కారణమని గరుడ పురాణం చెబుతోంది. సనాతన ధర్మంలో గరుడ పురాణాన్ని గొప్ప మహాపురాణంగా చెబుతారు. ఈ గరుడపురాణంలోని విషయాలు స్వయంగా మహావిష్ణువు చెప్పినట్టుగా భావిస్తుంటారు.
వీటిని మన జీవితంలో ఆచరణలోకి పెడితే అనేక సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చునని నమ్ముతారు. చాలా కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అది ప్రవర్తన కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలు రావొచ్చు. దాంతో తరచూ కుటుంబంలో గొడవలకు దారితీస్తుంది.
అప్పుడు ఇంట్లో శాంతి కరవుతుంది. అశాంతి నెలకొంటుంది. సహానం కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. ఇంట్లో మీరు పాటించే ఈ చెడు అలవాట్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి అలవాట్ల కారణంగా ఇంట్లో శాంతి వాతావరణాన్ని మార్చేస్తాయి. అనుకూల పరిస్థితులు పోయి ప్రతికూల పరిస్థితులు పెరిగిపోతాయి. డబ్బు వృథాగా పోతుంది.
ఏదో ఒక కారణంతో డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీపైనే కాదు.. మీ కుటుంబంపై కూడా తీవ్ర చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంతకీ ఆ చెడు అలవాట్లు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మీ ఇంట్లో కిచెన్ ఎలా ఉంది? :
కిచెన్ వాతావరణం చూస్తే చెప్పేయొచ్చు.. ఎందుకు ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉందో? కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కిచెన్ శుభ్రత విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఏముందిలే తర్వాత చేద్దాములే అని వదిలేస్తారు. రాత్రిసమయంలో ఆహారం తిన్న గిన్నెలు, పాత్రలను అలానే వదిలివేస్తారు. అలాచేస్తే పేదరికానికి సూచన అనే విషయం మరిచిపోవద్దు. గరుడ పురాణంలో చెప్పినట్టుగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి నిద్రపోయే ముందు మీ కిచెన్ లోని వంట పాత్రలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మీ ఇంట్లో గొడవలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది.
మీ ఇల్లు ఇలా ఉంటే అంతే :
మీ ఇల్లు చూడగానే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. కానీ, అలా కాకుండా నెగటివ్ ఫీలింగ్ అనిపిస్తే.. మీ ఇంట్లో దోషం ఉన్నట్టే. ప్రతిదానికి చిరాకు పడుతున్నారా? అది కూడా నెగటివ్ ఎనర్జీనే కారణమని గుర్తించుకోండి. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. వస్తువులన్నీ సరిగా సర్దుకోవాలి. కొంతమంది ఇంట్లో వస్తువులను చెల్లాచెదురుగా వదిలేస్తుంటారు. ఇల్లంతా చూడటానికి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఇలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత అవహిస్తుంది.
వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇంటిని మురికిగా లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారినపడకుండా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పినట్టుగా.. మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లో లక్ష్మి దేవీ నివాసం ఉంటుంది. లేదంటే ఇంట్లో విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తుంటాయి. ఇదే సంకేతం..
ఇంట్లో చెత్త ఇలా ఉందా? :
మీ ఇంట్లో చెత్తను ఇలా పడేశారా? అయితే వెంటనే క్లీన్ చేయండి.. లేదంటే మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులను మీరే ఆహ్వానించినట్టు అవుతుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, గొడవలు, చికాకులు అనేక రోగాలకు కారణమవుతుంది. ఇంట్లో చెత్తను శుభ్రం చేయాలి. బూజు దూలిపేయండి.. తుప్పు పట్టిన ఇనుము వంటి లోహాపు వస్తువులను వెంటనే బయట పారేయండి. పాడైన ఫర్నిచర్ వంటి పనికిరాని వస్తువులను బయట పారేయండి. మీ ఇంట్లో కష్టాలకు ఇదే కారణమని గుర్తించుకోండి. ఇంట్లో చెత్తను బయట పారేయడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని నివారించుకోవచ్చు.
Read Also : Goddess Laxmi: ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బు అస్సలే నిలవదు, ఎందుకంటే?