...
Telugu NewsDevotionalGoddess Laxmi: ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బు అస్సలే నిలవదు, ఎందుకంటే?

Goddess Laxmi: ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బు అస్సలే నిలవదు, ఎందుకంటే?

Goddess Laxmi: లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చాలానే చేస్తుంటారు. కానీ కొందరు ఏం చేసినా, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఉండదు. అయితే అందుకు కారణాలు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే ఎలా ఉండకూడదో, ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

తరచూ నిద్రపోకూడదు.. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే తరచుగా పడుకోకూడదని వేళ కాని వేళల్లో పడుకోవవడం వల్ల లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుందట. ముఖ్యంగా సంధ్యా సమయాల్లో అస్సలే నిద్ర పోకూడదని… ఒకవేళ సాయంత్రం పూట పడుకుంటే లక్ష్మీదేవి కోపానికి గురవుతామని చెబుతున్నారు.
అస్తమాను కోప్పడకూడదు.. తరచూ కోపంగా ఉండటం లక్ష్మీదేవికి అస్సలే ఇష్టం ఉండదట. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. చెడు మాట్లాడినా, కఠనమైన మాటలు మాట్లాడినా ధనలక్ష్మి తిరిగి వెళ్లిపోతుంది.

Advertisement

తరచూ తినకూడదు.. అతిగా తినడం కోసం డబ్బులు ఖర్చు చేయడం లక్ష్మీదేవికి అస్సలే నచ్చదు. ఆకలి వేసిన దాని కంటే అతిగా తినడం, అందుకోసం డబ్బులు వృథాగా ఖర్చు చేయడం మంచిది కాదని.. అలా చేస్తే లక్ష్మీదేవి తిరిగి వెళ్లిపోతుందట.

Advertisement

అతిథులను అగౌరవపరచద్దు.. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే… వారికి చక్కగా చూస్కోవాలి. వారిని బాధ పెట్టడం కానీ, అగౌరవ పరచడం కానీ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. ఇంటికి వచ్చిన బంధువులను ఎంత బాగా చూస్కుంటే.. లక్ష్మీదేవి అంత సంతోషంగా ఉండి మన ఇంట్లోనే ఉంటుంది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు