...

Devatha: ఆదిత్యకు షాక్‌ ఇచ్చిన దేవి… మాధవ్‌కి దగ్గరవూతూ ఏం చేయనుంది..!

Devatha: బుల్లితెరపై నిర్విఘ్నంగా ఆద్యంతం ఉత్కంఠతతో కొనసాగుతున్న సీరియల్‌ దేవత. మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాధవ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తాడు. అక్కడే దేవి చిన్మయిలను కలవడానికి ఆదిత్య వస్తాడు. అది గమనించిన దేవి ఆఫీసర్‌ సర్‌ మీద కోపంతో మాధవ్‌కి దగ్గరవుతున్నట్టు నటిస్తుంది. ఈ క్రమంలో ఇక దేవి ఆదిత్య చూస్తుండగా కావాలని మాధవ్‌ని పిలిచి మరీ ముద్దు పెడుతుంది.. నాన్న నువ్వు మాతో మంచిగా ఉంటానని మాటిచ్చావ్‌ గుర్తుందా అని అడుగుతుంది దేవి.. చెప్పమ్మా ఎలా ఉండాలో అని అనగానే.. చిన్మయి ఆఫీసర్ సారు లాగా ఉండాలి అంటుంది. దేవి వెంటనే ఆఫీసర్ సారు ఏంది మన నాన్న మన నాన్నలానే ఉండాలి వేరే వాళ్ళలా కాదు అని కోపంగా ఉంటుంది. నువ్వు మాతో మంచిగా ఉండు నాన్నా అనగానే.. సాయంత్రం పార్కుకి వెళ్ళొద్దాం నాన్న అని పిల్లలు అంటారు.

devatha latest episodes highlights

ఇక సీన్‌కట్‌ చేస్తే దేవి మాధవ్‌కి ముద్దుపెట్టడం చూసి చాలా బాధపడతాడు. నేను మీ నాన్ననమ్మ నన్ను దూరం చెయ్యడానికి నువ్‌ ఇవన్నీ చేస్తున్నావా అంటూ దుఃఖిస్తుంటాడు. ఇక మాధవ్‌ దేవి తనకు ముద్దు పెట్టడంతో ఆనందంతో ఉక్కిరిబ్బికిరవుతూ ఇంటికి వెళ్లి అమ్మ నాన్న అని పిలుస్తాడు. దేవి నన్ను తండ్రిగా గుర్తించిందని ఇన్ని రోజుల నుంచి నాన్న అని పిలుస్తుంది కానీ.. అంత ప్రేమ చూపించలేదని ఈ రోజు నన్ను తండ్రిగా గుర్తించిందని చెబుతాడు. సాయంత్రం పిల్లల్ని తీసుకొని పార్కు వెళ్దాం రెడీగా ఉండు రాధ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాధవ్‌ను ఇంత సంతోషంగా చూసి చాలా కాలమైంది. ఇదంతా నువ్వు, పిల్లలు, ఆ దేవుడి దయ వల్ల మాత్రమే అయిందని రాధతో వాళ్ల అత్తయ్య మామయ్య వాళ్ళు అంటారు.

తన సొంత కూతురు కాని దేవి.. మాధవ్‌పై ఇంత ప్రేమ చూపిస్తుంటేనే ఇంత ఆనందపడుతున్నాడు మాధవ్‌… మరి పెనిమిటికి దేవిని దూరం చేస్తే ఎంత బాధపడుతున్నాడో అని రాధ ఆలోచిస్తూ ఉంటుంది. పెనిమిటి దేవిని కలవడానికి, తన ప్రేమను పొందటానికి ఎంతలా ఆరాటపడుతూన్నాడో అని గుర్తుకు తెచ్చుకుని రాధ బాధపడుతుంది. ఆదిత్యను దేవికి దూరం చేశానని రాధ బాధపడుతుంది. ఇక దేవి మనసులో ఆఫీసర్‌పై ఉన్న ద్వేషాన్ని రాధ ఏ విధంగా తొలగించడానికి ప్రయత్నిస్తుందో తరువాత ఎపిసోడ్‌లో చూడాల్సిందే.!

Read Also : Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?