...

Devotional News : అప్పుల బాధతో సతమతమవుతున్నారా ? అయితే ఇవి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది !

Devotional News : ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఇలా అన్నీ కలగలిపి ఉండేదే జీవితం. కాగా మనలో చాలా మంది అప్పులతో సహవాసం చేస్తుంటారు. అప్పు లేని మనిషి ఉండడు… అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారు, ఎంత తీర్చినా అప్పుల నుంచి అసలు బయట పడలేకపోతున్నవారు కొందరు ఉంటారు. వారు గనుక ఈ సూత్రాలను ఫాలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అప్పుల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటో మీకోసం…

are-you-struggling-with-debt-but-if-you-do-these-lakshmidevi-with-you
are-you-struggling-with-debt-but-if-you-do-these-lakshmidevi-with-you

మహిళలు లక్ష్మీదేవి బొమ్మ ఉండే గొలుసును ధరించాలి. అలాగే కుడి చేతి ఉంగరం వేలికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించాలి. దీంతో ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే బంగారం లేదా వెండి లేదా కంచుతో లక్ష్మీదేవి విగ్రహాన్ని స్థోమతకు అనుగుణంగా తయారు చేయించి రోజూ పూజ చేయాలి. ఇలా 20 శుక్రవారాలు చేయాలి. దీంతో తప్పక ఫలితం ఉంటుంది.

అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు రోజూ స్ఫటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజ గదిలో లేదా మందిరంలో ఉంచి పూజలు చేస్తుండాలి. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు.

ఇక చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో గురువారం నాడు కనీసం ఒక కిలో చక్కెరను చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అప్పుల బాధల నుంచి విముక్తులు అవుతారు.

స్నేహితులకు వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని దానం చేయాలి. మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు ప్రమిదలను తెచ్చి అందులో నూనె వేసి దీపాలను వెలిగించి లక్ష్మీ దేవికి ప్రతి శుక్రవారం పూజ చేయాలి.

Read Also : Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!