Laughing Buddha : సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరికి డబ్బు సమస్య ఉంటే కొందరికి కుటుంబంలో కలహాలు ఉంటాయి. ఇక కొందరు దంపతులు ఎల్లప్పుడూ గొడవలు పడుతుంటారు. సంసారం సాఫీగా సాగదు. అయితే ఈ సమస్యలన్నింటికీ ఇంట్లో వాస్తు దోషాలు లేదా నెగెటివ్ ఎనర్జీ కారణం అవుతుంటాయి.
అలాంటప్పుడు వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటంటే…
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ గొడవలు జరుగుతుంటే.. అలాంటి ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తూర్పు వైపున ఉంచాలి. దీంతో గొడవలు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో అందరూ కలసి మెలసి ఉంటారు.
ఇంట్లో ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అలాగే డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. ఇంటి బయట అందరూ చూసేట్లు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే ఆ ఇంటిపై, ఇంట్లోని కుటుంబ సభ్యులపై ఉండే దిష్టి పోతుంది. ఉద్యోగులు తమ కెరీర్‌లో రాణిస్తారు. వ్యాపారస్తులు లాభసాటిగా వ్యాపారం చేస్తారు.
రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కార్యాలయాల్లో పెట్టుకుంటే ఉద్యోగులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దంపతులు బెడ్ రూమ్‌లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంట గదిలో, బాత్ రూమ్ సమీపంలో పెట్టరాదు. పెడితే అన్నీ సమస్యలే వస్తాయి.
Read Also : Karthika Deepam : ఆపరేషన్ జరిగిన పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నా మోనిత!
Tufan9 Telugu News And Updates Breaking News All over World