Malli Serial July 27 Today Episode : పెళ్లి సంతోషంలో తుళ్లి పడుతున్న మల్లి.. అసలు నిజం చెప్పనున్న అరవింద్..

Malli Serial July 27 Today Episode
Malli Serial July 27 Today Episode

Malli Serial July 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమౌతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా అరవింద్ కి మరియు మల్లి కి మరలా పెళ్లి జరుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సత్య తో ఇంటర్వ్యూ తీసుకుని ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోదాం అంటే సత్య ఇంకా టైం పడుతుంది అంటున్నాడు. ఇక్కడే ఉంటే వీళ్ళు నా చేత ఇంకా ఏమేం పనులు చేయిస్తారో అనుకుంటూ ఉంటాడు అరవింద్. వర్షం పడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అరవింద్ నీ డాన్స్ చేయమని కోరతారు. నాకు డాన్స్ రాదు అంటాడు. అప్పుడు మల్లి అక్కడికి వచ్చి బాబు గారికి డాన్స్ రాదు అతన్ని ఇబ్బంది పెట్టొద్దు కావాలంటే నేను మీతో డాన్స్ చేస్తాను అంటుంది.

Malli Serial July 27 Today Episode
Malli Serial July 27 Today Episode

అప్పుడు మీరా రవళి తో చూసావా బాబు గారిని మల్లి అసలు ఇబ్బంది పెట్టట్లేదు మల్లి లాంటి భార్య దొరకడం దొరబాబు గారు చేసుకున్న అదృష్టం అంటుంది. అప్పుడు మల్లి బాబు గారు వచ్చిన పని త్వరగా పూర్తిచేసుకుని మాలిని అక్క దగ్గరికి వెళ్లి సంతోషంగా ఉండాలి. అమ్మ సీతమ్మ తల్లి బాబు గారు మళ్లీ నేలకొండపల్లి రాకుండా నువ్వే చూసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ నేలకొండపల్లిలో అడుగు పెట్టకూడదు అనుకుంటాడు అరవింద్. మాలిని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్లి సారీ అత్తయ్య మా అమ్మ మిమ్మల్ని అలా అని ఉండకూడదు అనగానే అనుపమ మీ అమ్మగారు నీ మీద ఉన్న ప్రేమ వల్లనే అలా అన్నది నేను అర్థం చేసుకోగలను అంటుంది. అప్పుడు రూప మీ అమ్మగారి లాగానే అందరూ ఉంటే అప్పుడు అల్లుళ్లు చాలా క్రమశిక్షణగా ఉంటారు అంటుంది.

Advertisement
Malli Serial July 27 Today Episode
Malli Serial July 27 Today Episode

ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరకడం నేను చేసుకున్న అదృష్టం మీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే మా అమ్మ నీ అపార్థం చేసుకునే వాళ్ళు అని మాలిని అనగానే ఒక తల్లి బాధ ఇంకొక తల్లికే తెలుస్తుంది అంటుంది అనుపమ. అయినా నాకు చాలా గిల్టీగా ఉంది అత్త అంటుంది. అప్పుడు అనుపమ నీ బాధ పోవాలంటే మా అందరికీ పాయసం చేసి పెట్టి అంటుంది. అలాగే అత్తయ్య మీకు ఇష్టమైన మణిరత్నం సాంగ్స్ వింటూ ఉండండి నేను పాయసం రెడీ చేస్తాను అంటుంది మాలిని. అరవింద్ మరియు మల్లి ని ఊరేగింపుతో ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు మాలిని అరవింద్ కి కాల్ చేస్తుంది. అక్కడ పెళ్లి జరుగుతుంది అనుకుంటా మేళతాళాల శబ్దం వినిపిస్తుంది అనగానే అవును ఇక్కడ పెళ్లి జరుగుతుంది అంటాడు. నేలకొండపల్లి చాలా అందమైన ప్రదేశం నేను మా నాన్న పెయింటింగ్స్ లో చూశాను. నేలకొండపల్లి పేరు వినగానే మా నాన్న ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటుంది.

Malli Serial July 27 Today Episode
Malli Serial July 27 Today Episode

మా అమ్మ ఫేస్ మాత్రం వాడిపోతుంది. అన్నట్టు ఇవాళ మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. మా అమ్మ నన్ను నేలకొండపల్లి వెళ్లమని చెప్తుంది. నువ్వు చెప్పు రావాలా వద్దా అనగానే అరవింద్ ఇక్కడ ఏరియా అంత మంచిగా ఉండదు వద్దు అంటాడు. అప్పుడు రవళి అల్లుడు గారు త్వరగా రండి మీకు దిష్టి తీయాలి అంటుంది. అది విన్న మాలిని ఎవరు నిన్ను అల్లుడు గారు అంటున్నారు అనగానే అది నన్ను కాదు అంటాడు అరవింద్. ఇక్కడ చాలా డిస్టబ్ గా ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు మీరా అరవింద్ మరియు మల్లికి హారతి ఇస్తుంది. మాలిని తన ఫోన్లో అరవింద్ ఫోటో ని చూస్తూ నువ్వు అక్కడికి వెళ్ళాక చాలా బిజీ అయ్యావు నాకు సరిగా కాల్ కూడా చేయట్లేదు నేను చేస్తే మళ్లీ చేస్తా అని చెప్పి కట్ చేస్తున్నావ్. కనీసం తిన్నావా అని కూడా అడగట్లేదు.

Advertisement

Malli Serial July 27 Today Episode : నేలకొండపల్లికి వస్తున్న మాలిని.. షాకైన అరవింద్.. ఏం చేయనున్నాడు..!

Malli Serial July 27 Today Episode
Malli Serial July 27 Today Episode

నువ్వు వచ్చినప్పుడు నీతో వన్ మంత్ మాట్లాడను వద్దులే ఒకరోజు మొత్తం మాట్లాడను అనుకుంటూ ఉంటుంది. అది విని రూపా మరియు అనుపమ మాలిని దగ్గరకు వస్తారు. అప్పుడు అనుపమ ఎవరినైనా పిచ్చిగా ప్రేమించకూడదు వారికి మనం లోకువ అయిపోతాము అంటుంది. రండి భోజనం చేద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక మీరా అరవింద్ మరియు మల్ ఇక మీరా అరవింద్ మరియు మల్లికి ఒకే కంచంలో భోజనం పెట్టి తినండి అల్లుడు గారు ఇది మా ఊరి సాంప్రదాయం అంటుంది. అసలు మల్లి పెళ్లి చేసుకోను అనేది తన పెళ్లి జరగకూడదని ఆ సీతారాములను వేడుకునేది. కానీ ఆ సీతారాములు మల్లి మాటలు వినలేదు అంటుంది.

మల్లి నాకు భోజనం వద్దు ఏం వద్దు నాకు తినాలని లేదు అని అక్కడి నుండి వెళ్ళి పోతుంది. అప్పుడు అరవింద్ అక్కడికి వచ్చి ఎందుకు నీకు ఆకలిగా ఉన్నా నేను ఇబ్బంది పడతాను అని అక్కడి నుంచి వచ్చావు నీకు డాక్టర్ ఏమని చెప్పాడు టైం కి తినాలి అని చెప్పాడు కదా ఎప్పుడైనా మన గురించి ఆలోచించిన తర్వాతే ఎదుటివారి గురించి ఆలోచించాలి అంటాడు. అప్పుడు మల్లి థాంక్స్ బాబు గారు మన మధ్య జరిగింది ఏమీ మా వాళ్ళకు చెప్పలేదు అంటుంది. అప్పుడు అరవింద్ నేను నేలకొండపల్లి వచ్చినప్పుడల్లా నా ఫ్యామిలీకి, మాలినికి ఏదో ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మన బంధం బలపడాలని మీవాళ్లు ఏదేదో చేస్తున్నారు. నా చేతిలో తాళిబొట్టు ఉన్నప్పుడు ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైందనిపించింది అంటాడు అరవింద్. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.

Advertisement

Read Also : Malli Serial July 26 Today Episode : మల్లి సీరియల్.. మల్లిని మళ్లీ పెళ్లాడిన అరవింద్.. మల్లి మెడలో తాళి కడుతూనే మాలిని ఆలోచనలో అరవింద్..!

Advertisement