Malli Serial July 26 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్‌లో భాగంగా అరవింద్ మల్లిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందోతెలుసుకుందాం.. మల్లి అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ సంతోషం మరో రెండు రోజులే అంటే.. మా అమ్మ బాబు ఏమైపోతారో.. కోపంలో బాబు గారిని ఏం చేస్తారో అర్థం కావడం లేదు. అందుకే నేను ఇప్పుడు ఏది మొక్కుకోను.. అమ్మ నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యమ్మా.. అదే నా జీవితం అనుకుంటాను అని మల్లి మొక్కుకుంటుంది. అప్పుడు మల్లి వాళ్ళ అమ్మ.. మల్లి, బాబు.. పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అంటుంది. అప్పుడు మల్లి వాళ్ళ పెద్దమ్మ పిల్లా పాపలతో ఎప్పుడూ సంతోషంగా ఉండడని ఆశీర్వదిస్తుంది. మల్లి రెండు రోజుల్లో వెళ్లిపోయెదానికి మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు బాబు ఈ సంతోషమైనా మా అమ్మ వాళ్లకు మిగల్చడానికా ఇక అని మనసులో అనుకుంటుంది.
మల్లి వాళ్ళ అమ్మ మల్లి బాబు పదండి అంటుంది. అప్పుడు అరవింద్ మాలిని గురించి ఆలోచిస్తాడు. వెంటనే పంతులుగారు అమ్మ దండలు ఇవ్వండి.. ఇద్దరూ మార్చుకుంటారు అంటాడు. మల్లి ఇంకా అరవింద్ ఇద్దరూ దండలు మార్చుకుంటారు. వెంటనే పంతులు గారు బాబు అమ్మాయి తలపై జీలకర్ర పెట్టు బాబు అంటారు. అప్పుడు సత్య కూడా పెట్టు బాబు అంటాడు. వెంటనే అరవింద్ మల్లి తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. మళ్లీ వాళ్ళ పెద్దమ్మ అమ్మ అమ్మవారి దగ్గర మంగళ సూత్రాలు తీసుకురండి అంటుంది. సత్య మీరా, రవళి వెళ్లండి అంటాడు. ఇంకా అరవింద్ మల్లిని మంగళసూత్రం తీసుకెళ్ళడం ఏంటి మళ్లీ నీతో పెళ్లి చేస్తున్నారా.. అంటాడు. అప్పుడు మల్లి అదేంటి బాబుగారు అమ్మ వాళ్లు నీతో చెప్పారుగా.. మీతో చెప్పలేదా అంటుంది. అప్పుడు సత్య ఏమైంది మళ్లీ అబ్బాయికి ఏమైనా ఇబ్బందిగా ఉందా అరవింద్ బాబు గారు ఏమైనా ఇబ్బందిగా ఉందా అంటాడు. అప్పుడు అరవింద్ ఏం లేదు అంటాడు.
Malli Serial July 26 Today Episode : వందల సార్లు నీ మెడలో తాళి కట్టినా నా దృష్టిలో అదే పెళ్లే కాదు.. ఎందుకు మల్లి ఇలా చేస్తున్నావన్న అరవింద్
అరవింద్ తన మనసులో ఎందుకు మల్లి.. రెండు రోజుల్లో నీకు నేను దూరం అవుతున్నాను అని తెలిసికూడా ఎందుకు మల్లి ఇలా చేస్తున్నావ్.. నీ మెడలో ఇలా వందల సార్లు నేను తాళి కట్టిన అది నా దృష్టిలో పెళ్లి కాదు.. ఎందుకంటే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నేను మనస్పూర్తిగా నీ మెడలో తాళికట్టడం లేదు. మీరందరూ కలిసి నాతో ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారా మల్లి అని మనసులో అనుకుంటాడు. అప్పుడు పంతులుగారు ఆమె మెడలో తాళి కట్టు నాయన అంటాడు. వెంటనే అరవింద్ నేను ఈ క్షణం పైకి లేచి ఇదంతా నాకు నచ్చలేదని రచ్చరచ్చ చేయొచ్చు.. మహా అయితే నన్ను చంపేస్తారు.
నేను ఎప్పుడూ నా ప్రాణానికి విలువ ఇవ్వలేదు. కానీ నాకేమైనా అయిందని మాలినికి తెలిస్తే మాలిని బతకలేదు. ఇదంతా మాలిని కోసమే చేస్తున్నాను. అసలు సత్య మనసులో ఏముందో తెలుసుకొని మినిస్టర్ గారికి చెప్పి పాపం అమాయకమైన ప్రజలను కాపాడాలి అంతే కానీ నీ మీద ప్రేమతో ఈ తాళి కట్టడం లేదు మల్లి అని మనసులో అనుకుంటాడు. అప్పుడు మీరా బాబు కట్టండి అంటుంది. వెంటనే జగదాంబ మళ్లీ మెడలో తాళి కట్టడం అల్లుడు గారికి ఇష్టంలేనట్టుంది మీరా అంటుంది. అప్పుడు మీరా అదేం లేదమ్మా.. బాబు కట్టండి అంటుంది. వెంటనే అరవింద్ మళ్లీ మెడలో తాళి కడతాడు.
అప్పుడు మల్లి మీరు అప్పుడు బలవంతంగా తాళి కట్టారు అంతట మీరే కడుతున్నారు.. తను వదిలించుకోవడానికి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు.. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒకటే దైవ పూర్తిగా కట్టిన ఈ బంధం ఎటు దారి తీస్తుందో అని అనుకుంటుంది. అప్పుడు జగదాంబ నాకెందుకో పట్నం బాబు కి మల్లి అంటే ఇష్టం లేనట్టుంది. ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అని నాకు అనిపిస్తుంది అని మనసులో. అనుకుంటుంది. మీరా మీరిద్దరూ పిల్లాపాపలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటుంది. వెంటనే మళ్లీ మీరా నీ గట్టిగా పట్టుకొని మేము ఎప్పుడూ కలిసి ఉన్నావమ్మా మాలిని అక్క దొరబాబు గారు ప్రేమించుకున్నారు.. వాళ్ల ఇద్దరి మనసులు ఎప్పుడో కలిసిపోయాయి.. అయినా వాళ్ళిద్దరి మధ్య ఆ సీతారాములు నన్ను ఎందుకు పంపించారు అని మనసులో అనుకుంటుంది.
అప్పుడు సత్య సీతారాములు ఏం చేసినా మన మంచికే చేస్తారు. మేము కోరుకునేది ఏమిటంటే మా జీవితంలో ఏమైనా సంతోషాలు ఉన్నాయంటే అవి కూడా మీకే పంచాలని కోరుకుంటాము.. అరవింద్ బాబు నేను రైతు ని నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే మేము బంగారం కంటే మట్టిని ఎక్కువ ఇష్టపడతాము. ఎందుకంటే అది మనకు అన్నం పెడుతుంది కొంచెం ప్రేమ చూపిస్తే చాలు మన మట్టిలో కలిసే అంతవరకు ప్రేమగా చూసుకుంటుంది..నేను మల్లి ని మట్టితో పోలుస్తాను. మల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే మనం చెట్టుని రాళ్లతో ఎంత కొట్టినా అవి మనకి తియ్యని పండ్లను ఇస్తుంది. మల్లి ప్రేమ కూడా అలానే ఉంటుంది అంటాడు.
మీరా ఇక నేను వెళ్తాను నాకు చాలా పనులు ఉన్నాయి అల్లుడు గాని బాగా చూసుకో.. అయినా అల్లుడు గారిని చూసుకోవడానికి మల్లి ఉంది కదా ఇంక నేను వెళ్లి వస్తాను అంటాడు. అప్పుడు అరవింద్ సత్య ఇక్కడ ఆచారాలు అన్నీ అయిపోయాయి కదా నేను మీతో వస్తాను అంటాడు. అప్పుడు సత్య అల్లుడు గారు నేను మిమ్మల్ని నమ్మినట్టు ఇంకా వీళ్ళు నమ్మట్లేదు అంటాడు.. అప్పుడు అరవింద్ కానీ మీరు నమ్ముతున్నారు గా అంటాడు. అప్పుడు సత్య నమ్ముతారు కానీ అర్థం చేసుకోండి గవర్నమెంట్ అధికారులు చర్చకు పిలిచారు వాళ్లని కలిసే ముందు మీతో మాట్లాడతాను నన్ను నమ్మండి నా పనులు అయిపోయాక వస్తాను అంటాడు..ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.