Horoscope: ఈ వారం అంటే మే 15వ తేదీ నుంచి 21వ తేదీ వరుక ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మథున రాశి.. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడాలి. అడుగడుగునా ఆటంకాలుఉంటాయి, తెలివిగా అధిగమించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యుల సలహాతో తీసుకుంటే మేలుచేస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభం జరుగుతుంది.
తులా రాశి… మనోబలమే వీరిని ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాలను వాయిదా వేయటం మంచిది. ఎందుకంటే మీరు చేయాలకను పనికి చాలా ఆటంకాలు కల్గబోతున్నాయి. కాలం అస్సలే సహకరించటం లేదు. పొరపాటు జరిగితే సమస్య జటిలమవుతుంది. ఆత్మవిశ్వాసంతో విధులను నిర్వర్తించాలి. చంచలత్వం లేకుండా జాగ్రత్తపడాలి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు అధికమవుతాయి. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది.