Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు లక్కే లక్కు.. చూస్కోండి మరి!

Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీ సోమవారం నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా చాలా బాగుందని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. మేష రాశి వాళ్లు ఒక శుభ వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ వార్త వల్ల ఈరోజంతా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన పనులు కూడా చకచకా పూర్తి అవుతాయి. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

Advertisement

ధనస్సు రాశి.. ధనస్సు రాశి వాళ్లకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పైఅధికారుల ప్రోత్సాహం చాలా బాగా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈరోజు పైఅధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మొదలు పెట్టిన పనులను ప్రణాళికా బద్దంగా పూర్తి చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్ప వారిని చేస్తాయి. వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడం మంచిది.

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel