...

Rododendro benefits : ఆ మొక్కలో కరోనాను నియంత్రించే శక్తి ఉందట..ఏంటా మొక్క..?

Rododendro benefits :  కరోనాను నివారించే ఫైటోకెమికల్స్ ను హిమాలయాల్లో పెరిగే ‘రోడోడెండ్రాడ్ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శాస్త్రీయ పద్దతుల్లో పరీక్షించి కరోనా వైరస్ ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు.

కోవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే ఫైటోకెమికల్స్‌ ఈ మొక్క రేకుల్లో ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ మొక్కలోని ఫైటోకెమికల్స్ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయని పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధనా బృందం కనుగొన్న విషయాలను బయో మోలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.కరోనా వైరస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి రెండు సంవత్సరాలుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇన్ ఫెక్షన్ ను నివారించడానికి మార్గాలను కనుగొనే పనిలో ఉన్నారు.

”వ్యాక్సినేషన్ అనేది వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని శరీరానికి అందించడానికి ఒక మార్గం. అయితే, మానవ శరీరంపై వైరల్ దాడిని నిరోధించే టీకాయేతర ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధన జరుగుతోంది. ఈ మందుల్లో రసాయనాలు ఉపయోగిస్తారు.

ఇవి మన శరీర కణాలలోని గ్రాహకాలను బంధించి, వైరస్‌ లోనికి ప్రవేశించకుండా నిరోధించగలవు లేదా వైరస్‌ పైనే పనిచేస్తాయి” అని IIT మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ మసకపల్లి అన్నారు. హిమాలయాల్లోని వృక్షజాలం నుండి సేకరించిన రోడోడెండ్రాన్ అర్బోరియం రేకుల ఫైటోకెమికల్స్‌ను పరిశోధించామని, ఇది కోవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.

Read Also : అతనే నా సర్వస్వం అంటున్న బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరాయన..?