Kommu Senagalu : శనగలు తీసుకోవడం వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయా..?

kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas
kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas

Kommu Senagalu : శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఉడికించి తీసుకుంటారు.అయితే ఉడికించి తీసుకున్నా, క‌ర్రీ రూపంలో త‌యారు చేసి తీసుకున్నా.శ‌న‌గ‌లు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.అయితే ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.శ‌న‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు దాగున్నాయి.అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మ‌రి శ‌న‌గ‌లు తీసుకోవ‌డం బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas
kommu-senagalu-what-are-the-benefits-of-consuming-peas

నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే స‌మ‌స్య అధిక బ‌రువు.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు శ‌న‌గ‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. అందులో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి,మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్క‌వ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.దీంతో వేరే ఆహారం తీసుకోలేదు.త‌ద్వారా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Advertisement

అలాగే మ‌ధుమేహం ఉన్న వారు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.మ‌రియు త‌క్ష‌ణ శక్తి ల‌భిస్తుంది.ఇక చాలా మంది అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్నారు.అలాంటి వారు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే పాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు బ్లడ్ షుగ‌ర్ లెవల్స్ ని అదుపులోకి తెస్తాయి.అలాగే ర‌క్త‌హీన‌త త‌గ్గించ‌డంలోనూ,గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఉపయోగపడుతుంది.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఆప‌డంలోనూ శ‌న‌గ‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి. మహిళలకు అవ‌స‌ర‌మ‌య్యే ఫోలిక్ యాసిడ్ కూడా శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది.ఇక శ‌న‌గ‌ల్లో పీచుపదార్థం పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అయ్యి జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది.కాబ‌ట్టి, శ‌న‌గ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా కాక‌పోయినా,రెండు రోజులకు ఒక‌సారి అయినా తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

Advertisement

Read Also : Diabetes Reverse Diet Plan : దీర్ఘకాలంగా షుగర్ వేధిస్తుందా? ఇలా చేస్తే.. మీ ఒంట్లో షుగర్‌ దెబ్బకు నార్మల్‌కు వచ్చేస్తుంది.. మందులు లేకుండా కేవలం డైట్ మాత్రమే..!

Advertisement