Onion Amla Uses : ఉల్లిపాయను, ఉసిరిని కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది..?

what-happens-if-onion-and-amaranth-are-taken-together
what-happens-if-onion-and-amaranth-are-taken-together

Onion Amla Uses : ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఉసిరిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉసిరి చాలా విరివిగా లభిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా వినపడుతుంది.
రక్తహీనత సమస్య అనేది కేవలం ఐరన్ లోపం కారణంగా మాత్రమే రాదు. జింక్, రాగి, విటమిన్స్ లోపం వల్ల కూడా రక్తహీనత సమస్య వస్తుంది.

 

Advertisement

రక్తహీనత సమస్య ఉన్నవారికి నీరసం, అలసట, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండె దడ, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య రాగానే సాధ్యమైనంతవరకూ త్వరగా నివారణ అనేది చేసుకోవాలి.రక్తహీనత నివారించడంలో కొన్ని ఆహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఉసిరి,ఉల్లిపాయ బాగా పనిచేస్తాయి.

what-happens-if-onion-and-amaranth-are-taken-together
what-happens-if-onion-and-amaranth-are-taken-together

ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రక్తహీనత సమస్యను నివారించుకోవచ్చు. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు ఉసిరి ముక్కలు తీసుకుని పేస్టుగా చేసి రసం తీయాలి. ఈ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ప్రతిరోజూ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.ఈ విధంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. రక్తహీనత సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అదే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనలు పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

Advertisement

Read Also : Onion Health Benefits : ఎర్ర ఉల్లిపాయ తినొచ్చా? తెల్ల ఉల్లిపాయ మంచిదా? ఏది తింటే ఎక్కువ ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెలుసా?

Advertisement