Onion Health Benefits : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అయితే దాని అర్థం ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషక విలువలు ఉల్లిలో దాగున్నాయి అని అర్థం. ఉల్లిపాయ ద్వారా మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉల్లిపాయను మనం తరచుగా వంటల్లో వాడుతూ ఉంటాం. అసలు ఉల్లిపాయ లేకుండా ఏ వంట చేయరు. ఉల్లిగడ్డను పెరుగులో నంజుకుని తింటే ఆ మజానే వేరు. కానీ చాలామందికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిగడ్డను వంటల్లో చేర్చడం ద్వారా శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. కణాల వృద్ధిని దోహదం చేయడంతో పాటు ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
రక్తహీనతతో బాధపడేవారు ఈ ఉల్లిగడ్డను తమ ఆహారంలో చేర్చడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో పోరాడడంతో పాటు గుండెపోటు రాకుండా కాపాడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది. శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదలను ప్రోత్సహించి అధిక రక్తపోటు లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం లో బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇక ఉల్లిగడ్డ జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. తలపై ఏర్పడిన చుండ్రును నివారించడంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తుంది. కుదుళ్లను గట్టిగా హెల్దీగా ఉంచుతుంది.
Onion Health Benefits : ఉల్లిపాయ రసంతో అద్భుతమైన ప్రయోజనాలివే..
ఉల్లిగడ్డలో ఉండే క్యాల్షియం వలన ఎముకలు గట్టిపడతాయి. ఉల్లిగడ్డ లో ఉండే క్యాన్సర్ నియంత్రణ కణాలు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు నమలడం వల్ల నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా అంతమవుతుంది. సాధారణంగా మార్కెట్లో తెల్ల ఉల్లిగడ్డలు, ఎర్ర ఉల్లి గడ్డలు అని రెండు రకాలుగా లభిస్తాయి. వాస్తవానికి ఉల్లిపాయలో (Calcium) క్యాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్ లభిస్తాయి. అంతేకాదు.. యాంటీబ్యాక్టీరియల్ వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో వ్యాధులను నయం చేయడంలో ఎంతో సాయపడతాయి. కొంతమంది ఉల్లిపాయ తీసుకుంటే నోటి దుర్వాసన వస్తుందని వదిలిపెట్టరు. కానీ, ఉల్లిపాయతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అసలు తినకుండా వదిలిపెట్టరు.
ఉల్లిపాయ శరీరానికి అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అంతేకాదు ఆర్థరైటిస్ నొప్పిలను తగ్గించడంలో ఉల్లి రసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. ఉల్లిరసంలో నువ్వుల గింజలను వేసి బాగా వేడి చేయాలి. ఉల్లిరసం గోరువెచ్చగా చేసి నొప్పులు ఉన్నచోట రాయాలి. దాంతో ఆర్థరైటిస్ నొప్పి వంటి సమస్యల నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు. కాలిన గాయాలను తగ్గించడంలో ఉల్లిరసం అద్భుతంగా పనిచేస్తుంది. కాలిన చోట ఉల్లి రసాన్ని అప్లయ్ చేయడం ద్వారా కాలిన బొబ్బలు తగ్గిపోతాయి. కాలిన గాయాలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉల్లిరసం నివారిస్తుంది.
Read Also : health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..