Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

అతనే నా సర్వస్వం అంటున్న బాలీవుడ్ హీరో.. ఇంతకీ ఎవరాయన..?

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా వరుణ్‌ డ్రైవర్‌ మనోజ్ సాహు గుండెపోటుకి గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతని ... Read more

By Ramesh Babu

Published on: January 20, 2022 10:50 AM

Updated on: January 20, 2022 8:23 AM

---Advertisement---

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ విషాదంలో మునిగిపోయాడు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ నిన్న బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా వరుణ్‌ డ్రైవర్‌ మనోజ్ సాహు గుండెపోటుకి గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అతని మరణం విని వరుణ్‌ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.మనోజ్ సాహు మరణంపై తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు వరుణ్ ధావన్. ”26 ఏళ్లుగా మనోజ్‌ నాతో ఉన్నాడు. అతనే నాకు సర్వస్వం. నా బాధను తెలిపేందుకు నా దగ్గర పదాలు లేవు. కానీ నాకు కావాల్సింది అతని అద్భుతమైన తెలివి, హాస్య చతురత, జీవితం పట్ల అతనికున్న అభిరుచిని ప్రజలు గుర్తుంచుకోవడమే. నువ్‌ నా జీవితంలో నాతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను మనోజ్‌ దాదా” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

ఆ తర్వాత అతని అంతక్రియలు కూడా దగ్గరుండి జరిపించాడు వరుణ్ ధావన్.ఈ పోస్ట్ కి గతంలో మనోజ్ గురించి ఓ స్టేజిపై మాట్లాడిన వీడియోని కూడా జత చేశాడు. ఆ వీడియోలో కూడా వరుణ్ స్టేజిపై మనోజ్ గురించి గొప్పగా చెప్పాడు. ఒక డ్రైవర్ ని ఇంట్లో వ్యక్తిలా చూసుకోవడమే కాక అతనికి స్టేజిపై గౌరవం ఇవ్వడం, అతని మరణం తర్వాత ఇలా స్పందించడంతో వరుణ్ ధావన్ ని అభిమానులు, నెటిజన్లు పొగిడేస్తున్నారు.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!