...

Nutmeg Benefits : జాజికాయతో ఎన్ని రకాల నొప్పులు మాయమౌతాయో మీకు తెలుసా..?

Nutmeg Benefits : జాజికాయ‌.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల్లో జాజికాయను ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటలకు మంచి రుచిని అందిస్తుంది. జాజి కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఎముకలు మరియు కండరాలలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. జాజికాయను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. జాజికాయతో నూనె తయారు చేసుకుని వాడితే ఎలాంటి నొప్పులు అయినా సులభంగా తగ్గుతాయి. ఒక బాణలిలో 4 స్పూన్ల .ఆవ నూనె వేసి దానిలో ఒక స్పూన్ జాజికాయపొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసి బాగా కలపాలి. ఈ నూనెను సీసాలో నిల్వ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు కొంచెం నూనె తీసుకొని వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పులు అన్ని తొలగిపోతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు పసుపు కలిపి తాగాలి.ఈ విధంగా తాగితే డయాబెటిస్, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో వచ్చే మంటను తగ్గిస్తుంది. చిన్న వయసులో వచ్చే డయాబెటిస్ సమస్యలకు జాజికాయ మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…