ఈ రోజుల్లో ఎరిరిని చూపినా బీపీ, షుగర్ లతో బాధపడుతున్నారు. ఈ రెండు రోగాలు చాలా కామన్ అయ్యాయి. చిన్న వయసు వారిలో కూడా గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు తరచుగా వస్తున్నాయి. అయితే వీటిని ముందు నుండే రాకుండా చేయాలనుకున్నా ఈ రెండు పధార్థాలను కచ్చితంగా మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే అవేంటి వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి, బీట్ రూట్ తీసుకోవడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 28 మంది వాలంటీర్లపై చేసిన అధ్యయనంలో వెల్లుల్లి, బీట్ రూట్ లను వాడటం వల్ల బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉన్నట్లు తేలింది. అయితే ముందుగా 130 బీపీ ఉన్న వారి 28 మందిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి.. 3 వారాల వరకు వెల్లుల్లి, బీట్ రూట్ తినిపించారు.అయితే ఇవి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల 2 నుంచి 3 పాయింట్లు తగ్గిందట. రెండు నుంచి మూడు నెలలు కంటిన్యూగా తీసుకున్న వారిలో బీపీ మరింతగా తగ్గే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.