ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో మొదటగా ఉండేది…. మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య ప్రతీ ఒక్కరికీ వచ్చేస్తోంది. అయితే డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే నాలుగు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

49242073 – blood glucose meter, the blood sugar value is measured on a finger
- పాప్ కార్న్… ఆరోగ్యకరమైన చిరుతిండిలో ముందుగా ఉండేది పాప్ కార్న్ యే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్ల పాప్ కార్న్ తినాలి.
- పెరుగు.. డయాబెటీస్ పేషెంట్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు ఉండవు. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పెరుగు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని కారణఁగా మీరు మళ్లీ మళ్లీ తినకుండా ఉంటారు. ఈ విధంగా మీరు బరువు కూడా తగ్గుతారు.
- గింజలు… వాల్ నట్స్, జీడి పప్పు, బాదాం వంటి నట్స్ తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగదు. ఈ గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉండాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు వాల్ నట్లు, జీడిపప్పు, పిస్తా, బాదాం… మొదలైనవి తినిమాలి. అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు. వీటిని తీసుకోవడం ద్వారా కొవ్వు ఆమ్లాలు, పైబర్ వంటి పోషకాలు శరీరంరోలకి వెళ్తాయి. ఇి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- గుడ్లు… గుడ్లలో పిండి పదార్థాలు చాలా తక్కువ. దీని వల్ల శరీరంలో బ్లడ్, షుగర్ లెవెల్స్ అంతగా పెరగవు. ఉదయం లేదా సాయంత్రం ఆకలిని తీర్చుకోవడానికి మీరు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను తినవచ్చు. గుడ్డు ఆరోగ్యానికిఅనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Advertisement