...

Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?

Migraine Headache :  ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలో మైగ్రేన్ తల నొప్పి ఒకటి.ఈ తలనొప్పి సమస్యతో చాలామంది ప్రతిరోజూ ఎంతో సతమతమవుతుంటారు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఏమాత్రం ఉపశమనం ఉండదు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కళ్లు మూతలు పడటం, తలపై ఎవరు కొడుతున్నట్టు ఉండటం,మన చుట్టూ ఉన్న వస్తువులు కదులుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా ప్రతిరోజు చాలామంది ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు.

Migraine Headache
Migraine Headache

ఈ విధంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడుతూ ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల చాలా తొందరగా ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కా ఏమిటి అనే విషయానికి వస్తే..మన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో వికసించిన నీలిరంగు శంకు పుష్పాలను ఒక పది తీసుకోవాలి. ఈ పువ్వులను శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. తడి మొత్తం ఆరిన తర్వాత ఒక ఒక కప్పు కొబ్బరి నూనెలోకి ఈ పువ్వులను వేసి ఆ గిన్నెపై మరొక గిన్నె ఉంచి పది నుంచి పదిహేను నిమిషాలు చిన్నమంటపై మరిగించాలి.

ఈ విధంగా మరిగించిన నూనెను ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.ఇక ఈ నూనెతో ప్రతి రోజూ రాత్రి పడుకునే సమయంలో మర్దన చేసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఈ నూనె తొందరగా ఈ సమస్య నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ నూనెను ఉపయోగించడంతో పాటు మందులను తరుచు ఉపయోగిస్తూ ఉండాలి.

Read Also :  Covishield vaccine: కొవిషీల్డ్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. బూస్టర్ డోసు తీసుకోకపోతే వేస్టే!