September 22, 2024

Covishield Vaccine : కొవిషీల్డ్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. బూస్టర్ డోసు తీసుకోకపోతే వేస్టే!

1 min read
covishield does not workon omicron details here

Covishield Vaccine : కరోనా టీకా తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ టీకా ప్రభావ వంతంగా పని చేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది. దిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కొవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండు సార్లు ఆయన కరోనా బారిన పడ్డారు. గతంలో కరోనా సోకి, కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్న వారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమిక్రాన్ సమర్థంగా ఎదుర్కోగల్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి వారు కొవిడ్ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వివరించారు.

Covishield Vaccine
Covishield Vaccine

పరిశోధకులు కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలి సారిగా 2020 అక్టోబర్ 9న కొవిడ్ పాజిటివ్ వచ్చిందట. ఏడాది తర్వాత అంటే 2021 నవంబర్ లో అతడిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కూడా కరోనా సోకింది. తాజాగా ఈ సంవత్సరం అంటే 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఆ ఆరోగ్య కార్యకర్త కొవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డుసును మార్చి 3న తీసుకున్నారు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్ పై మెరుగైన రోగ నిరోధకు స్పందనను కలిగిస్తున్నందున కొవిషీల్డ్ తీసుకున్న వారు కచ్చితంగా వేయించుకోవాలని చెబుతున్నారు. అప్పడే కోరనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే మీరు కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకొని ఉంటే… బూస్టర్ డోసు కూడా కచ్చితంగా తీసుకోండి.

Read Also : Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?