Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Covid Vaccine Prices : కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకా ధరలపై DCGI కీలక నిర్ణయం.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Covishield Covaxin Prices : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ టీకాలు పూర్తి కాగా.. ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ డబుల్ డోస్‌లు వంద శాతానికి చేరనున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు కొన్ని కంపెనీల కరోనా టీకాల డోసులు పంపిణీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ... Read more

By Vinod Kumar

Published on: January 27, 2022 4:01 PM

Updated on: August 4, 2025 9:05 PM

Covishield Covaxin Prices : DCGI Key Decision Covishield Covaxin Vaccine Prices may cost Rs 275 per dose

---Advertisement---

Covishield Covaxin Prices : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ టీకాలు పూర్తి కాగా.. ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ డబుల్ డోస్‌లు వంద శాతానికి చేరనున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు కొన్ని కంపెనీల కరోనా టీకాల డోసులు పంపిణీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలోనే టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి.

సింగిల్ డోసు రూ.275గా నిర్ణయించే ఛాన్స్ :
సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉంది. దీనికి రూ.150 సర్వీసు రుసం అదనంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సర్వీసు రుసుంతో కలిపి రూ.1200కు అందుబాటులో ఉంది. కొవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఈ రెండు టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.

కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారాన్ని డీసీజీఐకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అందించాయి.

Read Also : కరోనాను ఓడించాలంటే ఈ జాగ్రత్తలే మీకు రక్ష!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..