Papaya leaves juice: మనం ఆహారంగా తీస్కునే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. బొప్పాయి పండ్ల వల్ల చాలా మేలు ఉంటుంది. బొప్పాయి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయే వాటి చెట్ల ఆకుల్లో అంతకంటే ఎక్కువే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలను కల్గి ఉంటాయి. డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు బొప్పాయి ఆకులు దివ్య ఔషధంగా పని చేస్తాయి. సాధారణంగా మన రక్తంలో లక్షా 50 వేల ప్లేట్ లెట్ల నుంచి 4 లక్షల 50 వేల వరకు ఉంటుంది. డెంగ్యూ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి ప్లేట్ లెట్ల సంఖ్యను క్రమంహా తగ్గిస్తుంది. వీటి సంఖ్య బాగా తగ్గినప్పుడు ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది.
రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినపుడు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగతుంది. ఈ ఆకుల్లో ఉండే ఎంజైమ్ లు ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకుల నుండి కాండం నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. ఆ త్రావత కొద్దిగా నీళ్లు పోసి పిండుతూ రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి కొద్దిగా తేనెను కలిపి తీస్కోవాలి. అలా తరచుగా చేస్తే ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.