Giloy Plant: సాధారణంగా మొక్కలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అనారోగ్య సమస్యలను నివారించటానికి కొన్ని మొక్కలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అటువంటివాటిలో తిప్పతీగ కూడా ఒకటి. దీనిని “గిలోయ్” అని కుడా అంటారు. తిప్పతీగలో ఉండే ఎన్నో ఆయుర్వేద గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలో సహకరిస్తాయి. తిప్ప తీగ ఆకులను తినటం లేదా ఆ ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తిప్ప తీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకులను నమిలి తినటం లేదా ఈ ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా నివారిస్తుంది. ఈ తిప్పతీగ ఆకులతో తయారుచేసిన క్యాప్సిల్స్ కూడా ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. తిప్పతీగ ఆకులను కషాయం చేసుకుని తాగితే దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
తిప్పతీగ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతాయి. తిప్పతీగ ఆకులను ఆరబెట్టి పొడి చేసుకుని బెల్లంతో కలిపి ప్రతిరోజు తినటం వల్ల అజీర్తి , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం తిప్పతీగ ఆకులతో తయారుచేసిన చూర్ణం తినటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించి వారి వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు తిప్పతీగతో తయారు చేసిన కషాయం తాగడం లేదా గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగడం వల్ల వారి సమస్య తగ్గుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World