Health Tips: సాధారణంగా మన భారతదేశంలోకొన్ని రకాల వంటకాలను తయారు చేయడానికి నెయ్యి ఉపయోగిస్తారు. నెయ్యి తో తయారు చేసిన వంటకాలు అద్భుతమైన రుచి సువాసన కలిగి ఉంటాయి. నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొంతమంది నెయ్యికి బదులు డాల్డా ఉపయోగించి ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తుంటారు. డాల్డా చౌకగా లభించే హైడ్రోజినేటెడ్ పామాయిల్. డాల్డా ఉపయోగించి వంటలు తయారుచేసే తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఓకేనా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాల్డా కు దూరంగా ఉండటం శ్రేయస్కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక బరువు ఉన్నవారు నెయ్యి బదులు డాల్డా ఉపయోగించటం వల్ల డాల్డా లోని కొవ్వు పదార్థాలు శరీరంలో పేరుకుపోయి బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు డాల్డా కు దూరంగా ఉండాలి.
అంతేకాకుండా డాల్డా ఎక్కువగా తినటం వల్ల అందులో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు పెద్ద పేగు కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాల్డా ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు డాల్డా ఎక్కువగా తీసుకోవటం వల్ల అందులో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించకుండా చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పొరపాటున కూడా డాల్డా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.