...

Coriander Health Benefits : కొత్తిమీర తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Coriander Health Benefits : కొత్తిమీర కేవలం రుచి, సువాసన కోసం కూరలలో వినియోగిస్తారు. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని ఇంట్లోనే కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు. కొత్తిమీర ఆహారంలో చేర్చటం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో ఉండే అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

coriander-health-benefits-to-reduce-fat
coriander-health-benefits-to-reduce-fat

రోజూ కొత్తిమీర తినడం వల్ల అధిక రక్తపోటును, చెడు కొవ్వును తగ్గించి గుండె పనితీరు మెరుగు పరుగుస్తుంది. అంతేకాదు ఈ కొత్తిమీర జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కొత్తిమీర లో ఉండే డోడిసేనల్ అనే పదార్థం ద్వారా పేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ లనుతగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

Coriander Health Benefits : కొత్తిమీర తింటున్నారా? తప్పక తెలుసుకోండి..

కొత్తిమీరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్నిఅదుపుచేస్తుంది. కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి దోహదపడే జీర్ణపరమైన జ్యూసులు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

Read Also : Winter Fruits Health benefits : వింటర్‌లో ఇబ్బందులకు ఈ ఫ్రూట్స్‌తో చెక్ పెట్టండి..