Winter Fruits Health benefits : నేచర్ మనకు అన్నింటిని సమానంగా ఇస్తుంది. అందులో భాగంగానే కాలాలు సైతం.. అందులో వర్షాకాలం, వింటర్, సమ్మర్.. ఇలా మూడు ఉంటాయి. అన్ని కాలాలను అందరూ ఇష్టపడతారు. ఆయా సీజన్‌లలో చాలా రకాల ఫ్రూట్స్ మనకు లభిస్తుంటాయి. వాటిని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎంతో మేలు కలుగుతుంది. వింటర్ సీజిన్‌లో బాడీ టెంపరేచర్ తగ్గుతుంటుంది. చలి పెరగడంతో మన రెగ్యలర్ పని కూడా డిస్టర్బ్ అవుతుంది.
ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ గా లేడీస్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి చాలా పోషకాల అవసరమవుతాయి. వింటర్ లో చర్మం, జుట్టు, బోన్స్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. మెయిన్‌గా 40 ఏళ్లు పైబడిన లేడీస్‌లో కాళ్లు, వెన్ను వంటి నొప్పులు వస్తుంటాయి.
ఇలాంటి సమయంలో బాడీలో హీట్‌ను కాస్త పెంచుకుకోవడంతో పాటు పోషకాలను ఇచ్చేందుకు చాలా పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గంజి ఇది మంచి బ్రేక్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. బాడీకి వెంటనే శక్తిని ఇస్తుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యంల కూడా బాగుంటుంది. వింటర్‌లో విటమిన్ సి చాలా ముఖ్యం.
నారింజ, కివి, జామ, బొప్పాయి, నిమ్మ వంటి వాటిని రెగ్యులర్‌గా తినాలి. స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ, పొటాషియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇక ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వింటర్‌లో వీటిని తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు రాగులు, బాదం, అక్రోట్స్ వంటి డ్రై ఫ్రూట్ సైతం తీసుకుంటే బాడీకి కాల్షియం తదితర పోషకాలు అందుతాయి.
Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!