Health Tips : ప్రస్తుతం వర్షాకాలం ముగిసి వింటర్‌లోకి వచ్చాం. ఈ సీజన్‌లో చాలా మంది ఎక్కువగా దగ్గు, జలుపు, గొంతునొప్పి, ఫీవర్‌తో బాధపడుతుంటారు. ఈ సీజన్‌లో ఇవన్నీ కామన్. అయితే వీటిని తగ్గించుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడుతుంటారు. అయితే మెడిసిన్స్‌ను ఎక్కవగా వాడితో భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే చాన్స్ ఉంది. అలాంటి టైంలో మన వద్ద ఉన్న కొన్ని నేచురల్ ఐటమ్స్‌తో ఇలాంటి డిసీజెస్‌కు చెక్ పెట్టొచ్చు. వీటితో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ఆ డిసీజ్ ఇబ్బందుల నుంచి మనం కాస్త రిలీఫ్ పొందుతాం.
ముందుగా 10 తులసి ఆకులు తీసుకోవాలి. ఆ తర్వాత మిరియాలు(10), కొంచెం అల్లం ముక్క, కొద్దిగా పటికబెల్లం తీసుకోవాలి. ఫస్ట్ అల్లం తొక్కను తీసేసి మెత్తగా నూరుకోవాలి. అనంతరం ఇందులోనే మిరియాలు సైతం వేసి దంచాలి. తులసి ఆకులను సైతం దానిలో కలిపి మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి. దాన్ని అలాగే పక్కన పెట్టెయ్యాలి. సౌ పై పాత్ర పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఆ నీటిని బాగా మరిగనివ్వాలి. అందులో మందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ నీరు సగానికి వచ్చాక అందులో కాస్త పటికబెల్లం వేయాలి.
అనంతరం కషాయాన్ని వడపోయాలి. వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చని స్టేజ్‌లో ఉన్నప్పుడు టీకప్పు క్వాంటిటీలో దానిని తాగాలి. దానిని తాగాకా గంట లోపు ఎలాంటివి తినొద్దు. దీని వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వల్ల నుంచి చాలా రిలీఫ్ లభిస్తుంది. ఇలా అప్పడుప్పుడు ట్రై చేయడం వల్ల చాలా వరకు సీజనల్ వ్యాధుల నుంచి మన బాడీని మనం రక్షించుకోవచ్చు. ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలి. వారి సలహాలు, సూచనలు పాటించడం తప్పనిసరి.
Read Also : Health tips: రోజూ ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే చాలా మంచిది!