Bilateral macrostomia : చిన్నారులు నవ్వుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది. పసిపాపల బోసి నవ్వులు ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది. వాళ్లు నవ్వుతూ అటు ఇటు తిరుగుతుంటే అలాగా చూడాలనిపిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఐలా సమ్మర్ ముచా అనే పాప ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. 2021 డిసెంబర్ లో జన్మించిన సమ్మర్ ముచాకు పుట్టుక తోనే అరుదైన వ్యాధి ఉంది. బైలేటరల్ మైక్రోస్టోమియా అనే వింత వ్యాధి ముచాకు సోకింది. ఈ వ్యాధి కారణంగా బుజ్జాయి పెదాలు సాగినట్లు ఉంటాయి. పెదాలు అలా సాగినట్లు ఉండటంతో చిన్నారి ముఖం ఎప్పుడూ నవ్వినట్లుగానే ఉంటుంది.
బైలేటరల్ మైక్రోస్టోమియా వ్యాధి పాప కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు చిందిస్తున్నట్లుగా ఉండే ఆ పాప చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఆమె చిన్న పాటి స్టార్ గా కూడా మారంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… చిన్నారి ముచా పెదాలు అలా సాగినట్లు ఉండటంతో పాలు తాగలేక పోతోంది. ముచా పెదాలను సరి చేసేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ చేసి పెదాలను మాములుగా చేయాలని అధ్యయనం చేస్తున్నారు.
బైలేటరల్ మైక్రోస్టోమియా అరుదైన వాటిలో చాలా అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా చాలా తక్కువే నమోదయ్యాయి. 2007లో చేసిన ఓ అధ్యయనం ప్రకరాం.. ఈ తరహా కేసులు ఆ కాలం నాటికి కేవలం 14 మాత్రమే ఉన్నాయి. 0
Read Also :Child Care: చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే… ఈ ఆహార పదార్థాలు తినిపించాల్సిందే!