Child Care: సాధారణంగా తల్లిదండ్రులు వారి చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వారికి ఇటువంటి ఆహారం తినిపించాలి. ఎటువంటి ఆహారం తింటే వాళ్ళు బలంగా ఉంటారు. అదేవిధంగా పిల్లలను ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పిల్లల కోసం వైద్య నిపుణులను కూడా సంప్రదిస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు చిన్న వయసులో ఏది తినాలి అన్న కూడా మారాం చేస్తూ ఉంటారు.పిల్లలు ఫుడ్ సరిగా తినకపోవడం తో సరైన ఫుడ్ లేక పిల్లల్లో కూడా గ్రోత్ ఉండదు. మరి పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని తినిపించాలి. ఏ వయసు పిల్లలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విషయాల గురించి చర్చించుకుందాం..
ఒకవేళ పిల్లలు ఆరు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లు అయితే కొన్ని ఆరోగ్యమైన పండ్లను తినిపించవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కివి ఫ్రూట్ ని తినిపించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నిపుణులు చెబుతున్నారు. కివి లో విటమిన్-సి,ఐరన్పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును తినడం వల్ల దూరం చేయడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చిన్న పిల్లలకు కివి నీ తినిపించడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెళ్లి ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న పిల్లలు ఎక్కువగా మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మలబద్ధకం పిల్లలకు ఇబ్బంది కలిగించడంతో సరైన ఆహారం తీసుకోరు. ఇలాంటప్పుడు పరిస్థితిలో కివి ని వారికి తినిపించాలి. ఇందులో ఉండే ఫైబర్.. జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచుగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ప్రీ మెచ్యూర్‌గా ఉన్న బిడ్డ తరచుగా వ్యాధులను ఎదుర్కోవలసి వస్తుంది. 6 నెలల తర్వాత కూడా, పిల్లలు ప్రీ మెచ్యూర్ కావడం వల్ల తరచుగా వ్యాధులకు గురవుతారు. ఆ సమయంలో వైద్యుని సలహా మేరకు వారికి కివి తినిపించొచ్చు. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కివీ వంటి పండ్లను తప్పనిసరిగా తినిపించాలి. కివిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని మీ బిడ్డకు క్రమం తప్పకుండా తినిపిస్తే ఐరన్ సమస్య తీరుతుంది. అయితే, కొన్ని పరిస్థితులలో నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే కివి వారికి తినిపించాలి. ముఖ్యంగా పిల్లలకు ఉదర సమస్యలు, దద్దుర్లు ఉంటే కివిని తినిపంచకూడదని నిపుణులు చెబుతున్నారు.