Cholesterol Control Tips : మన శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం సర్వసాధారణం.అయితే కొలెస్ట్రాల్ శాతం అధికం అయినప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతాయి కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చు.అయితే ప్రస్తుత కాలంలో తీసుకుంటున్న ఆహార పదార్థాల కారణంగా ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టు సూచించే లక్షణాలు ఏమిటి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరిగినప్పుడు ముందుగా దవడ బాగం, చేతులు అధిక నొప్పిని కలిగి ఉంటుంది.
అదేవిధంగా శరీరం నుంచి అధిక చెమటలు వెలువడుతాయి.
అదేవిధంగా తరచు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది.
ఈ విధమైనటువంటి లక్షణాలు తరచూ మనలో కనుక ఉంటే తప్పకుండా ఇది కొలెస్ట్రాల్ పెరిగిందని సూచించే లక్షణాలే అని గుర్తించి వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
అదే విధంగా కొన్ని హోం టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
Cholesterol Control Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టే… ఈ టిప్స్ తో చెక్ పెట్టండి!
ప్రొద్దుటూరు విత్తనాలను ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైన వాటిగా భావిస్తారు. ఈ ప్రొద్దుటూరు విత్తనాలలో అధికంగా యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పాలిసోచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.ఇది కొలెస్ట్రాల్ నియంత్రించడంలో దోహదపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఇకపోతే పొద్దుతిరుగు విత్తనాలను ప్రతిరోజు ఉదయం తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. ఈ గింజలను ప్రతిరోజు ఉదయం సలాడ్, ఓట్స్ లేదా గంజిలో కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు.
Read Also : Health tips: బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!