Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అంటే టక్కున గుర్తు రాకపోవచ్చు కానీ జాతి రత్నాలు చిట్టి అంటే మాత్రం అందరికీ టక్కున ఈ హీరోయిన్ గుర్తుకొస్తారు. జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పూర్తిస్థాయి హీరోయిన్ గా ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. ఇకపోతే ఈమె నాగచైతన్య, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా అదరగొట్టారు. చిట్టికి నటన కన్నా డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలిపారు.
ఇకపోతే గతంలో ఓసారి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈమె నడిరోడ్డుపై తీన్మార్ స్టెప్పులతో అందరిని సందడి చేశారు. ఇక ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొక డాన్స్ వీడియో ద్వారా అందరిని సందడి చేశారు. ఇక ఈమె షేర్ చేసిన ఈ వీడియోలో ఈమె ఏకంగా బెల్లీ డాన్స్ చేసి అందరిని ఓ ఊపు ఊపారు. ఇలా బెల్లీ డాన్స్ ద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ చేసిన ఫరియా ఈ డాన్స్ పర్ఫామెన్స్ తో అందరి హృదయాలను కొల్లగొట్టింది.
Faria Abdullah : జాతి రత్నాలు హీరోయిన్ బెల్లీ డాన్స్ అదరగొట్టిన చిట్టి
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిట్టి అందరి గుండెల్లో సెగలు పుట్టించావు అంటూ కొందరు కామెంట్లు చేయగా చిట్టిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ తన బెల్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా అందరిని సందడి చేశారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డాన్స్ వీడియో పై ఓ లుక్ వెయ్యండి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Faria Abdullah : అక్కడ షేవ్ చేసుకోలేదా అంటూ కామెంట్ చేసిన నెటిజన్.. ఘాటు రిప్లై ఇచ్చిన జాతి రత్నాలు చిట్టి