Health Tips: సాధారణంగా మహిళలలో ప్రతి నెల అండం విడుదలయ్యే సమయంలో వైట్ డిశ్చార్జ్ కావడం సర్వసాధారణం. ఇలా అండం విడుదల అయ్యే సమయంలోనూ అదే విధంగా భార్య భర్తల కలయిక తర్వాత వైట్ డిస్చార్జ్ అవడం సర్వ సాధారణమైన విషయమే. అయితే కొంతమంది మహిళలలో ఈ రెండు సమయాలలో కాకుండా ఇతర సమయాల్లో కూడా అధిక మొత్తంలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఎంతో దురద మంటగా ఉంటుంది.ఈ విధంగా తరచూ వైట్ డిశ్చార్జ్ అయి ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
అలాగే వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడే మహిళలు ఏ విధమైనటువంటి నొప్పి దురద మంట లేనివారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటి అనే విషయానికి వస్తే….
* వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడేవారికి మెంతులు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. అర లీటర్ నీటిలోకి కొన్ని మెంతులను వేసి ఆ నీరు సగం అయ్యేవరకు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని చల్లార్చి వడగట్టుకుని తాగటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
* అలాగే ఒక గ్లాస్ నీటిలోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ధనియాలు నీటిని తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తొలగిపోతుంది.
*ఉసిరి పొడి వైట్ డిశ్చార్జ్ సమస్యను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.ఉసిరికాయలను భాగ ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలోకి రెండు టేబుల్ టీ స్పూన్ల ఉసిరి పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తాగటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
*చాలా మంది మహిళల్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడమే కాకుండా దుర్వాసన సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు బెండకాయ ముక్కల్ని బాగా మరిగించి ఆ నీటిని తాగటం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్యతో పాటు దుర్వాసన కూడా రాకుండా అదుపు చేస్తుంది.
*అరటి పండు వైట్ డిశ్చార్జ్ సమస్యను పూర్తిగా నయం చేస్తుంది. అధిక వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడేవారు బాగా పండిన అరటి పండును ప్రతిరోజు రెండు తినడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
*ఈ విధమైనటువంటి చిట్కాలను పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పుడే వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. భార్య భర్తల కలయిక అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి.
*ఇక దుస్తుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా బిగుతుగా లేకుండా కొద్దిగా వదులుగా ఉన్నటువంటి కాటన్ లో దుస్తులను వేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించి ఈ విధమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World