Health tips : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అంతా ఎదుర్కొంటున్న సమస్య మోకాళ్ల నొప్పు, కీళ్ల నొప్పు, జాయింట్ పెయిన్స్. అయితే ఇవి ఒకప్పుడు వయుసు మళ్లిన వాళ్లలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం… మనం తినే ఆహారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు అని కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మందికి చిన్న చిన్న పనులకే అలసట, షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇలాంటి నొప్పులకు తరచూ వైద్యలు దగ్గరకు వెళ్లడం, మాత్రలు వాడటం వంటివి చేయడం కంటే ఇంట్లోనే సింపుల్ చిట్కాలు వాడటం మంచిదని చెబుతున్నారు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
అయితే తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఆలివ్ చెట్టు ఆకుల రసం మోకాళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పని చేస్తుందని తేలింది. స్విస్ శాస్త్ర వేత్తల కీళ్ల నొప్పుల నివారణకు చేసిన పరిశఓధనల్లో ఆలివే లేదా ఆలవ్ ఆకుల రసం పెయిన్ కిల్లర్ గా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆలివ్ చెట్టు ఆకుల్లో ఉన్నఔషధ సమ్మేళనాలు దీర్ఘకాళిక నొప్పులను కూడా అత్యంత ప్రతిభఆవంతంగా నివారిస్తాయని తెలుస్తోంది. ఆలివ్ ఆకులు రొ్ము క్యాన్సర్, అల్సరేటివ్, డిప్రెషన్ తగ్గించడంలోనూ సాయపడతాయి. ఆలివ్ ఆకుల రసం కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని మస్క్యులోస్కెలెటల్ డిసీజ్ జర్నల్ థెరప్యూటిక్ అడ్వాన్సెస్ ఓ కథనంలో పేర్కొంది.
ఆలివ్ ఆకుల్లోని ఔషధాలను పాలీఫెనాల్స్ అని పిలుస్తారు. ఇవి దీర్ఘకాళిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మంచి ఉపశమనం కల్గిస్తాయి. కీళ్ల నొప్పిని, వాపును తగ్గించడంలో సాయపడతాయి. ఆలివ్ ఆయిల్ హృదయ ధమనుల లోపల చేరుకున్న కొవ్వు నిల్వలను కరిగించి… తద్వారా గుండెకు కూడా రక్షణ అందిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. శాస్త్రజ్ఞుల చేసిన పరిశోధనలో 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 124 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనను స్విస్ శాస్త్రవేత్త మేరీ నోయెల్ హోర్కాజాడా నాయకత్వం వహించారు. అధిక బరువు ఉన్న 62 మందికి కీళ్ల నొప్పుల నివారణ కోసం 125 ఎంజీ ఆలివ్ ఆకుల సారాన్ని రోజుకు రెండు సార్లు మాత్ర రూపంలో ఇచ్చారు. ఇలా రోజూ 6 నెలల పాటు ఇచ్చారు. అనంతరం వీరు మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు గుర్తించారు.
Read Also : Gauva Leaves : జుట్టు నల్లగా, పొడుగ్గా కావాలంటే ఈ ఆకులు వాడాల్సిందే..!