Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Updated on: October 9, 2024

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది. పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనిషి శ్రమకు అవసరమైన శక్తిని వినియోగించుకోవచ్చు. మనిషి జీవన ప్రక్రియలో ఇదంతా ఓ భాగం. మనిషి కష్టపడాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. లేదంటే పనిచేయలేము.. ఫలితంగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోయూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగిపోతాయి.

ఇవి ఎక్కువ‌గా పెరిగితే ‘గౌట్’ అనే స‌మ‌స్య ఉత్పన్నమవుతుంది. దీనివలన కీళ్ల లో రాళ్ల లాంటి స్పటికాలు ఉత్పత్తి అవుతాయి. వీటి వలన కీళ్లలో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. అక్కడ అంతా వాపులు రావడం, నొప్పి, ఎర్రగా కనిపిస్తుంటుంది. అయితే, యూరిక్ యాసిడ్ నిల్వలను శరీరంలో తగ్గించుకోవాలంటే కొన్ని ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడాల్సి ఉంటుంది. దీంతో యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. గౌట్ సమస్య రాకుండా ఉంటుంది. ఇంతకూ ఏం చేయాలంటే.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడాలి.

Uric Acid cause Gout : Uric Acid cause Gout Disease Infected from Food 
Uric Acid cause Gout : Uric Acid cause Gout Disease Infected from Food

పున‌ర్నవ.. దీనిలో అనేక ఔషధ గుణాలుంటాయి. ఇది కీళ్లలో వాపులను తగ్గించి నొప్పి రాకుండా చేస్తుంది.యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేసి బయటకు పంపుతుంది. పున‌ర్నవ అనేది మాత్రలు, పౌడర్ రూపంలో ఆయుర్వేదం మందుల షాపుల్లో దొరుకుతుంది. గుగ్గులు.. ఇది కూడా మార్కెట్‌లో మాత్రల రూపంలో దొరుకుతాయి.పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి. వైద్యుల సలహా తీసుకోవాలి. తిప్పతీగ‌.. యూరిక్ యాసిడ్‌పై ఈ మొక్క నుంచి తీసిన రసం బాగా ప‌నిచేస్తుంది.

Advertisement

శరీరంలో పిత్త దోషాన్ని త‌గ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. రోజూ ఉదయం 30 ఎంఎల్‌ రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తుంగ ముస్తలు.. ఇది తీసుకుంటే ‘గౌట్’ స‌మ‌స్య దూరం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి రాత్రి పొద్దున తీసుకోవాలి. బ్లాక్ కిస్మిస్.. రోజూ నీటిలో నాన‌బెట్టి 10 నుంచి 15 వరకు ఉద‌యాన్నే తీసుకోవాలి.

Read Also : Rakul Preet Singh : సినిమా కోసం అలాంటి పనులు అస్సలే చేయను.. ఏదైనా సహజంగా జరగాలి!  

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel