Tamarind Seed Benefits : చింతగింజలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!

Updated on: January 27, 2023

Tamarind Seed Benefits : పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి ఇళ్లలోని వంటింట్లో ఉండేది చింత పండు అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరు దాదాపుగా చింతపండు వంటకాలను ఇష్టపడుతుంటారు. అయితే, ఈ చింతపండు గుజ్జును ఉపయోగించుకుని చారు చేసుకుని మిగతా గింజలను మనం పారేస్తుంటాం. కానీ, ఆ గింజలతోనే మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం. చింత గింజలు ఒకప్పుడు పిల్లలు కాల్చుకుని తింటూ ఉండేవారు. కానీ కాలక్రమంలో అటువంటి అలవాటు లేకుండా పోయింది. ఈ సంగతి పక్కనబెడితే.. చింత గింజలతో ఆర్థటైటింస్, వొళ్లు, కీళ్ల నొప్పులకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. అయితే, చింతగింజలను డైరెక్ట్‌గా తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇలా చేయాలి. చింత గింజలను సేకరించి బాగా వేయించాలి. అనంతరం ఒక గిన్నెలో వేసి నానబెట్టాలి.

tamarind-seeds-benefits-for-knee-pains-in-telugu
tamarind-seeds-benefits-for-knee-pains-in-telugu

అయితే, నానబెట్టే క్రమంలో అందులో ఉన్న వాటర్‌ను ప్రతీ రోజు తీసేసి మళ్లీ కొత్త నీళ్లు పోస్తుండాలి. అలా రెండు లేదా మూడు రోజులు అయిన తర్వాత వాటర్ పూర్తిగా తీసేసి చింత గింజలపై ఉన్న పొట్టును తీసేయాలి. అనంతరం ఆ చింత గింజలను ముక్కలుగా కట్ చేసుకుని ఎండ బెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండగానే వాటిని పొడి చేసుకుని గాజు గ్లాసులో స్టోర్ చేసుకుని ప్రతీ రోజు గ్లాసు పాలలో కలుపుకుని తాగాలి. అలా చేయడం వల్ల కీళ్లలో అరిగిపోయిన గుజ్జు పునరుత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఈ చింత గింజల పొడిని స్త్రీలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే.. స్త్రీలకు వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గుతుంటుంది.

దాంతో పాటు మహిళలు చేసే పనుల వల్ల వారిలో నడుము, వెన్నుముక నొప్పి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో వారు చింత గింజల మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. చింత గింజలు హ్యూమన్ బాడీలోని కొవ్వను కూడా కరిగించేస్తాయి. చింత గింజలలో ఉండే టానిన్ స్కిన్‌ను హెల్దీగా ఉంచడంలో దోహదపడుతుంది. చింత గింజలలోని కాల్షియం, ఇతర మినరల్స్ హ్యూమన్ బాడీకి అవసరమైనవి. ఈ క్రమంలోనే చింత గింజల పొడిని ఎముకలు విరిగిన చోట రాసుకోవాలి. అలా చేయడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. బోన్స్ హెల్దీనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చింత గింజలు తీసుకోవడం వల్ల స్కిన్, హార్ట్ సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి.

Advertisement

చింతగింజలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. శారీరకంగా కలిగే అనేక నొప్పుల నుంచి చింతపిక్కలతో ఉపశమనం పొందవచ్చు. చింతగింజలను పౌడర్ లా చేయాలి. మీ శరీరంలో కండరాల నొప్పులను తొందరగా మటుమాయం చేసేస్తుంది. కాల్షియం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ చింతగింజలు బాగా పనిచేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వును కరిగించడంలోనూ చింతపిక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారిలో చింతపిక్కలతో తొందరగా నొప్పుల నుంచి బయటపడొచ్చు. ఎముకలు దృఢంగా మారడానికి చింతగింజలతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు.

Read Also : Diabetes Reverse Diet Plan : దీర్ఘకాలంగా షుగర్ వేధిస్తుందా? ఇలా చేస్తే.. మీ ఒంట్లో షుగర్‌ దెబ్బకు నార్మల్‌కు వచ్చేస్తుంది.. మందులు లేకుండా కేవలం డైట్ మాత్రమే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel