Health Tips : కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా… మీ నొప్పిని దూరం చేసే చిట్కాలు !

Health Tips : మారుతున్న కాలానుగుణంగా వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. అయితే మీరు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలను నిత్యం ఆహారంలో తీసుకునే వారికి కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది.

ఇది కాకుండా కీళ్ల నొప్పులకు సహజ నివారణలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వ్యాధి చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసిలో ఉండే సహజ లక్షణాల వల్ల దీని నూనెని తయారు చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం దొరుకుతుంది. అలానే ఈ కిట్కాలు కూడా మీ బాధను దూరం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

  • సరైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చాలి. ఇందులో ఉండే కొవ్వు ఆర్థరైటిస్ నొప్పికి ఉపయోగపడుతుంది. చేప నూనెలో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వారానికి ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి మంచిది.
  • మీరు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం. వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పరుగుతో పాటు ఏరోబిక్, స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.
health-tips-to-avoid-knee-pains-and-arthritis
health-tips-to-avoid-knee-pains-and-arthritis
  • హాట్ అండ్ కోల్డ్ థెరపీ కీళ్ల నొప్పులకు చాలా విశ్రాంతినిస్తుంది. ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఈ నీటిలో మీ పాదాలను 10 నుంచి 15 నిమిషాలు పెట్టాలి. ఈ సమయంలో పాదాలను తేలికగా రుద్దుతూ ఉంటే నీటి వేడి, మసాజ్ చర్మం రంధ్రాలను తెరుస్తుంది. ఎప్సమ్ సాల్ట్ శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను బయటకు తీస్తుంది. తరువాత చేతులు, మోచేతులను ముంచండి. నీరు వేడిగా ఉండేలా చూసుకోండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మీ చేతులను తుడవండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కీళ్ల నొప్పులు రావడంలో పెరిగిన బరువు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు పెరగడం వల్ల ముఖ్యంగా మోకాళ్లు, అరికాళ్లు, తుంటిలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీరు కీళ్ల నొప్పులను వదిలించుకోవాలనుకుంటే బరువును తగ్గించుకుంటే మంచిది.

    Read Also : Hair Growth Tips : అధిక జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా… ఈ నూనె రాస్తే చాలు పది రోజులలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel