Childrens Care : కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలలో కొన్ని రకాల లక్షణాలు కనపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. మరి పిల్లలలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటి అనే విషయానికి వస్తే ముందుగా పిల్లలలో అతిసార లక్షణం కనబడితే నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అతిసారంతో పాటు కడుపునొప్పి, జ్వరం, గొంతు నొప్పి, అలసట, పొడిదగ్గు, వాంతులు కావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, ముక్కు కారడం కండరాల నొప్పి వంటి లక్షణాలు కనపడితే నిర్లక్ష్యం చేయకుండా పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించే పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి వీలైనంతవరకు బయట తిరగకుండా పిల్లలను ఇంటి పట్టునే ఉండేలా చూసుకోవాలి. అలాగే వారికి సరైన పోషకాహారం ఇవ్వడంతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక అర్హులైన పిల్లలందరికీ కరోనా టీకాలు వేయించడం ఎంతో ముఖ్యం. ఇక విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినిపించడం, ఆహారంలో తక్కువగా ఉప్పు వాడటం, అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం, వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Read Also :Child Care: చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే… ఈ ఆహార పదార్థాలు తినిపించాల్సిందే!