September 21, 2024

Health Tips: పూర్వీకులు చెప్పిన లక్షణాలను బట్టి పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా? అని ఇలా నిర్ధారించవచ్చు..!

1 min read
pjimage 55

Health Tips: మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం.పెళ్లి జరిగిన తర్వాత ప్రతి మహిళ ఎంతో అపురూపమైన చిత్రం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే గర్భవతులుగా ఉన్న మహిళలకు పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేసి కడుపులో ఉన్న బిడ్డ ఆడ లేదా మగ అని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అలా చేయటం చట్ట విరుద్ధమైన చర్య.

pjimage 55మన పూర్వీకులు చెప్పిన కొన్ని లక్షణాలను బట్టి కడుపులో పెరుగుతున్న శిశువు ఆడ లేదా మగ అని నిర్ధారించవచ్చు. సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలకు వివిధ రకాల ఆహార పదార్థాలను తినాలి అని ఎంతో ఆశగా ఉంటుంది. గర్భంతో ఉన్న సమయంలో ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనిపిస్తే కడుపులో పెరుగుతున్న శేషు అమ్మాయి అని నిర్ధారించవచ్చు. అలా కాకుండా పుల్లగా, కారంగా తినాలనిపిస్తే అబ్బాయి అని నిర్ధారించవచ్చు.

మహిళలు గర్భం దాల్చిన తర్వాత మొదటిలో ఆ గర్భిణీ మహిళ ముఖం కాంతివంతంగా ఉంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ అబ్బాయి అని, అదే గర్భవతిగా ఉన్న మహిళలకు గర్భం వచ్చిన మొదటి లో మొహం కాంతివిహీనంగా తయారైతే పుట్టబోయే బిడ్డ అమ్మాయా అని నిర్ధారించవచ్చు.

గర్భిణులు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎల్లప్పుడు కుడివైపుకు ఉంటే పుట్టబోయేది అమ్మాయి అని, అదే కడుపులో పిండం ఎక్కువగా ఎడమవైపు ఉంటే పుట్టబోయేది అబ్బాయి అని నిర్ధారించవచ్చు. మన అమ్మమ్మలు ఇలాంటి కొన్ని లక్షణాలను బట్టి పుట్టబోయేది ఆడ లేక మగ శిశువు అని ఒక నిర్థారణకు వస్తారు.