Health Tips: ఈ పండు గింజలను పడేస్తున్నారా…అయితే ఈ ప్రయోజనాలను కోల్పోయినట్టే?

Health Tips: కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి. అవి మాత్రమే కాకుండా కొన్ని రకాల పండ్లలోనీ విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. వాటి గురించి చాలామందికి అవగాహన ఉండదు.ఈ గింజలని చెత్తకుండీలో వేసే బదులు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలా మంచిది. అత్యధిక పోషకాలు కలిగిన గింజలలో గుమ్మడికాయ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

గుమ్మడి గింజలలో కొవ్వు, విటమిన్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెరగటానికి తోడ్పడతాయి. గుమ్మడికాయ గింజలను పచ్చిగా కూడా తినవచ్చు. కానీ కాల్చిన గుమ్మడి గింజలు మరింత రుచికరంగా ఉంటాయి. బొప్పాయి గింజలలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా బొప్పాయి గింజలు విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని వ్యాధులకి చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి.

Advertisement

సాగర్ నగర్ చింతపండు ను ఉపయోగించి వాటి గింజలను పడేస్తూ ఉంటారు. ఈ గింజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చింతపండు గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదని చాలా పరిశోధనలలో కూడా రుజువైంది. ఈ విత్తనాలు గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దంతాలకు కూడా మేలు చేస్తాయి. చింత గింజలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కూడా కాపాడతాయి. కొంతమంది ఇప్పటికి వీటిని కాల్చుకొని తింటారు. ఇవి కీళ్ల నొప్పులని తగ్గించడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తాయి.

Advertisement