Health Tips: మన భారతీయ వంటింట్లో ఉండే ఎన్నో రకాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు మనం చేసే వంటలలో పసుపు కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. పసుపు వల్ల శరీర ఆరోగ్యం చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. పసుపులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా నయం చేయవచ్చు. ముఖ్యంగా పచ్చి పసుపు వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పసుపుని ఎన్నో రకాల డ్యూటీ ప్రోడక్ట్ తయారీలో వినియోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం పెరగటం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారటం, అనేక ఇతర చర్మ సంబంధిత సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పచ్చి పసుపుతో చెక్ పెట్టవచ్చు.
మొఖం మీద మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, చర్మం ముడతలు పడటం వంటి సమస్యల నివారణకు పచ్చి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖం మీద నల్ల మచ్చలు ముడతలు ఇబ్బందిపడేవారు పచ్చి పసుపు ఉపయోగించి వారి సమస్యలను నివారించవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పసుపు రసాన్ని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొంచం శెనగ పిండి కలిపి ముఖానికి రాసుకోవాలి ఇలా తరచూ చేయటం వల్ల ముఖం మీద అ ఉన్న జిడ్డు తొలగిపోయి నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడేవారు ఒక టేబుల్ స్పూన్ పచ్చి పసుపు రకం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ఉన్నచోట రాసి మర్ధన చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తప్పకుండా ఇలా చేయటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.