Actress Nikita : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయింది. హాయ్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సంబరం మూవీలో నటించి అందరిని మెప్పించింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ నిఖిత.. కేవలం కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లోనే కాదు.. తెలుగులోనూ అనేక మూవీలు నటించింది. డాన్ మూవీలో రాఘువ లారెన్స్ కు జోడీగా కూడా నటించింది.

తెలుగు కొన్ని సినిమాల్లో నటించినా నిఖిత అనుకున్న సక్సెస్ రాలేదు. స్టార్ హీరోయిన్ కావాల్సిన నిఖిత మధ్యలోనే తన కెరీర్ ముగిసిపోయింది. అప్పటినుంచి సినిమాలకు నిఖిత దూరంగా ఉంది. నిఖితకు ఓ స్టార్ హీరోతో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో సినీపరిశ్రమలో వివాదానికి దారితీసింది. కన్నడ సినీపరిశ్రమలో నటించే టైంలో స్టార్ హీరో దర్శన్‌తో ఓ మూవీలో నటించింది. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
Actress Nikita : నిఖితపై మూడేళ్లు బ్యాన్ చేసిన కన్నడ పరిశ్రమ..
అప్పుడు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ బాగానే ప్రచారం జరిగింది. కట్ చేస్తే స్టార్ హీరో దర్శన్ భార్య ఈ విషయం తెలిసింది. కానీ, హీరో దర్శన్ మాత్రం అలాంటిది ఏమి లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిరోజుల తర్వాత వారిద్దరిపై దర్శన్ భార్య విజయ లక్ష్మి నిఘా పెట్టింది.

ఒక రోజున నిఖిత, భర్త దర్శన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందట. భర్తకు నిఖిత మధ్య ఉన్న అక్రమ సంబంధంపై ఆయన భార్య ఘాటుగానే స్పందించింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలకు దారితీశాయి. ఆ క్రమంలో తాగిన మైకంలో భార్య తలపై గన్ను పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అక్రమ సంబంధంతో తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అప్పట్లో హీరో దర్శన్ అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. దాంతో నిఖితని కన్నడ పరిశ్రమ నుంచి 3 ఏళ్ల పాటు నిషేధించింది. ఆ తర్వాత నిఖితకు అండగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో నిఖిత డిప్రెషన్లోకి వెళ్లి ఆస్పత్రిలో చేరిందట.. ఆ తర్వాత సినీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమనిగేలా చేశారని టాక్ నడిచింది.
Read Also : Punch Prasad : రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియాలో రచ్చ..